...
...
Next Story

OTT Review: స్టాకర్స్‌ను వెంటాడే ‘ఐస్’.. ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

OTT Review: మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్.. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సమాజంలోని స్టాకింగ్ (వెంటపడి వేధించడం) సమస్యను కళ్లకు కట్టేలా సాగిన ఈ సిరీస్ ఎలా ఉంది అన్నది ఈ రివ్యూలో చూడండి.

Published on: Oct 9, 2026, 18:39:34 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Review: మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు మన దేశంలో ఉండే క్రేజే వేరు. రీసెంట్‌గా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) వేదికగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మలయాళం డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ఐస్' (Eyes). ప్రముఖ నటి కని కుసృతి, నిఖిలా విమల్, శ్రుతి రామచంద్రన్ కాంబినేషన్‌లో దర్శకుడు మను అశోకన్ తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్ రివ్యూ రేటింగ్
మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్ రివ్యూ రేటింగ్

సమాజంలో మహిళలు రోజువారీ ఎదుర్కొనే సీరియస్ ప్రాబ్లమ్ 'స్టాకింగ్' (వేధింపులు, ఆకతాయిల వెంటపడటం) బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. అయితే కేవలం ఒక రెగ్యులర్ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్‌లా కాకుండా సైకాలజీ, సాఫ్ట్‌వేర్ ట్రాకింగ్‌ను మిక్స్ చేసి సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేశారు.

ఐస్ వెబ్ సిరీస్ విశేషాలు

టైటిల్ : Eyes (ఐస్)

భాష : Malayalam (మలయాళం), తెలుగులోనూ అందుబాటులో..

జానర్ : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీ : SonyLIV (సోనీ లివ్)

ఎపిసోడ్లు : 7 ఎపిసోడ్లు (ఒక్కోటి సుమారు 50 నిమిషాలు)

డైరెక్టర్ : మను అశోకన్

నటీనటులు : కని కసృతి, నిఖిలా విమల్, శృతి రామచంద్రన్,

జాఫర్ ఇడుక్కి, దేవ్ మోహన్, సానియా ఇయ్యప్పన్, ప్రభు మురళీకృష్ణన్

'ఐస్' వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి?

మహిళలను పదే పదే వేధించే ఆకతాయిలు, ప్రేమికుల పేరుతో సైకోలుగా మారే స్టాకర్ల మానసిక పరిస్థితిని అంచనా వేసి నేరాలను అరికట్టేందుకు కేరళ పోలీస్ విభాగం 'ఐస్' అనే ఒక ట్రయల్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోర్ టీమ్‌లో సైకాలజిస్ట్ ఐషా (నిఖిలా విమల్), ఐటీ ఎక్స్‌పర్ట్ విద్యా (శ్రుతి రామచంద్రన్)తో పాటు పోలీస్ ఆఫీసర్లు టీనా సెబాస్టియన్ (కని కుసృతి), జస్టిన్ (ప్రభు మురళీకృష్ణన్) ఉంటారు.

ఈ వెబ్ సిరీస్‌కి ప్రధాన బలం నటీనటుల పర్ఫార్మెన్స్. పోలీస్ ఆఫీసర్ టీనా పాత్రలో కని కుసృతి తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె కాజువల్ ఎక్స్‌ప్రెషన్స్, సీరియస్ సీన్లలో చూపించిన ఇంటెన్సిటీ సూపర్. ఇక సైకాలజిస్ట్‌గా నిఖిలా విమల్, ఐటీ డిజైనర్‌గా శ్రుతి రామచంద్రన్ తమ వంతు పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

సపోర్టింగ్ రోల్స్ చేసిన జాఫర్ ఇడుక్కి, దేవరాజ్ (దేవ్ మోహన్), సానియా ఇయ్యప్పన్ తమ పాత్రల్లో జీవించారు. డైరెక్టర్ మను అశోకన్ కథను డీల్ చేసిన విధానం బాగున్నా, 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ 50 నిమిషాల నిడివితో ఉండటం, మధ్య ఎపిసోడ్స్‌లో కాస్త సాగదీత కావడం కాస్త బోర్ కొట్టిస్తుంది.

అయితే సమాజంలో వేళ్లూనుకున్న స్టాకింగ్ లాంటి సబ్జెక్ట్ ను తీసుకొని, ఆ స్టాకర్లనే కేసుల పేరు చెప్పి భయపెట్టి వాళ్లపైనే ట్రయల్ చేయడం సిరీస్ లో ఆసక్తి రేపే పాయింట్. స్టాకింగ్ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? స్టాకర్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ల నుంచి బాధితులను ఎలా కాపాడుతారన్నది చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

మొత్తంగా చూస్తే.. రెగ్యులర్ థ్రిల్లర్ల కంటే భిన్నంగా, ఒక మంచి సోషల్ కాజ్‌తో వచ్చిన ఈ 'ఐస్' మలయాళం వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో వన్ టైమ్ వాచ్‌గా చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks