Mamita Baiju: ఈ మలయాళ కుట్టి దూకుడు మామూలుగా లేదు.. మూడు భాషలు, ముగ్గురు స్టార్ హీరోలు.. నెల గ్యాప్‌లోనే అన్నీ రిలీజ్
Mamita Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు మాంచి జోరు మీద ఉంది. ఆమె నటించిన మూడు వేర్వేరు భాషల సినిమాలు నెల రోజుల గ్యాప్ లోనే థియేటర్లలోకి వస్తుండటం విశేషం. ఈ మూడు మూవీస్ లోనూ టాప్ హీరోలు లీడ్ రోల్స్ లో నటించారు.
Mamita Baiju: 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా అంతటా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అరుదైన హిస్టారికల్ మైల్‌స్టోన్‌ను క్రియేట్ చేయడానికి రెడీ అయింది. కేవలం 30 రోజుల గ్యాప్‌లోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు వస్తోంది. యంగ్ జనరేషన్ హీరోయిన్లలో ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి అరుదైన ఫీట్ సాధించిన వారు చాలా అరుదుగా ఉంటారు.

ఈవారమే జన నాయగన్
ఈ క్రేజీ జర్నీలో మొదటిది కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లీడ్ రోల్ ప్లే చేసిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' (తెలుగులో జననాయకుడు). ఎన్నో వాయిదాల తర్వాత ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ గురువారమే అంటే జులై 23న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
దళపతి విజయ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పక్కన మమితా ఒక పవర్‌ఫుల్ రోల్ లో కనిపించనుండటం ఆమె కెరీర్‌కే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారనుంది.
టాలీవుడ్ డెబ్యూ.. సూర్య సరసన లక్కీ ఛాన్స్
ఇక రెండో సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా డెబ్యూ ఇస్తోంది ఈ బ్యూటీ. స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’లో మమితా నటిస్తోంది. ఈ ప్యూర్ ఎంటర్‌టైనర్‌లో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య సరసన ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమాలో మమితా క్యారెక్టర్ చాలా బబ్లీగా, లైవ్లీగా ఉంటుందని ప్రమోషనల్ స్టఫ్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతోంది. తెలుగు, తమిళం ఆడియన్స్‌ను ఒకేసారి మెప్పించడానికి ఈ క్యారెక్టర్ బాగా సాయపడుతుందని ఇండస్ట్రీ టాక్. సూర్య క్రేజ్, వెంకీ అట్లూరి సక్సెస్ ట్రాక్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
మలయాళంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్
ఈ రెండు పెద్ద సినిమాల హడావుడి ముగిసిన వారం రోజులకే, అంటే ఆగస్ట్ 21న తన మాతృభాష మలయాళంలో 'బెత్లహేమ్ కుడుంబ యూనిట్' సినిమాతో అలరించడానికి వస్తోంది. మమితాకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన 'ప్రేమలు' డైరెక్టర్ గిరీష్ ఏడీ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ మేల్ లీడ్‌గా నటిస్తుండగా, వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ పై కనిపించడం ఇదే మొదటిసారి.
ప్రేమలు లాంటి క్లీన్ హ్యూమర్, లవ్ స్టోరీలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతంలో 'డ్యూడ్', 'కర' లాంటి సినిమాలతో తన యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకున్న మమితా బైజు.. ఇప్పుడు ఒకే నెలలో తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లు కలిగి ఉండటం ఒక అరుదైన రికార్డ్.
ఇంత తక్కువ టైమ్‌లో ముగ్గురు వేర్వేరు స్టార్ హీరోల సినిమాలతో రావడం ఏ యంగ్ హీరోయిన్‌కైనా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా నిలిస్తే, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఆమె రేంజ్, రెమ్యునరేషన్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం.
మమితా బైజు మూడు సినిమాలు
* నటి: మమితా బైజు
* మూవీ 1: జన నాయగన్ (తమిళం, తెలుగు)
-హీరో: దళపతి విజయ్
- రిలీజ్ డేట్: జులై 23
* మూవీ 2: విశ్వనాథ్ అండ్ సన్స్ (తెలుగు, తమిళం)
- కోస్టార్: సూర్య, డైరెక్టర్ : వెంకీ అట్లూరి
- రిలీజ్ డేట్: ఆగస్ట్ 14
* మూవీ 3: బెథ్లహామ్ కుడుంబ యూనిట్ (మలయాళం)
- హీరో: నివిన్ పాలీ
- రిలీజ్ డేట్: ఆగస్ట్ 21
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


