Mammootty: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత పురస్కారాలైన జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఏక్తా నగర్‌లో జరిగిన ఈ వేడుకలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఉమ్మడిగా ఉత్తమ నటుడి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను అందుకున్నారు.

భారతీయ సినిమా విభిన్న సంస్కృతులను, ప్రతిభను ఒకటిగా కలిపే క్రమంలో ఈ ఏడాది హిందీ, మలయాళం నటులు ఒకే వేదికపై ఈ గౌరవాన్ని పంచుకోవడం విశేషం.
మమ్ముట్టికి స్టాండింగ్ ఓవేషన్.. వేదికపై అపూర్వ గౌరవం
మలయాళ సీనియర్ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి వేదికపైకి రాగానే ఆడిటోరియం అంతా ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడ ఉన్న ప్రముఖులందరూ లేచి నిలబడి ఆయనకు 'స్టాండింగ్ ఓవేషన్' ఇచ్చి ఘనంగా గౌరవించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏకంగా నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకుని మమ్ముట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.
పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో పీరియాడిక్ ఫోక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి చూపించిన విశ్వరూపానికి ఈ పురస్కారం దక్కింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కొడుమోన్ పొట్టిగా మమ్ముట్టి చేసిన నెగెటివ్ ఛాయలున్న పాత్ర నభూతో నభవిష్యత్ అనిపించింది.
మమ్ముట్టి ఏమన్నారంటే?
రెడ్ కార్పెట్ మీద మమ్ముట్టి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. "దేశం నుంచి ఇలాంటి పెద్ద గుర్తింపు దక్కడం ప్రతీ యాక్టర్‌కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నా లైఫ్‌లో ఇది నాలుగో జాతీయ అవార్డు కావడం నా అదృష్టం. ఇన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది" అని తెలిపారు.
తన యాక్టింగ్ గురించి చెప్తూ.. "ముందుగా మంచి స్క్రిప్ట్, ఆ తర్వాతే నా క్యారెక్టర్ ఎంచుకుంటాను. సెట్‌కి వెళ్లేముందు నేను పెద్దగా ప్రిపరేషన్స్ ఏమీ చేయను. ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని అనను కానీ లక్కీగా సీన్స్ అలా కుదిరిపోతాయి. నా డైరెక్టర్, మేకప్ డిజైనర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ క్రెడిట్ మొత్తం టీమ్‌కి ఇచ్చారు. గతంలో మమ్ముట్టి 'మథిలుకల్', 'పొంతన్ మాడ', 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్' చిత్రాలకు గానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.
తొలి జాతీయ పురస్కారంతో కార్తీక్ ఆర్యన్
{{/usCountry}}తన యాక్టింగ్ గురించి చెప్తూ.. "ముందుగా మంచి స్క్రిప్ట్, ఆ తర్వాతే నా క్యారెక్టర్ ఎంచుకుంటాను. సెట్‌కి వెళ్లేముందు నేను పెద్దగా ప్రిపరేషన్స్ ఏమీ చేయను. ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని అనను కానీ లక్కీగా సీన్స్ అలా కుదిరిపోతాయి. నా డైరెక్టర్, మేకప్ డిజైనర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ క్రెడిట్ మొత్తం టీమ్‌కి ఇచ్చారు. గతంలో మమ్ముట్టి 'మథిలుకల్', 'పొంతన్ మాడ', 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్' చిత్రాలకు గానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.
తొలి జాతీయ పురస్కారంతో కార్తీక్ ఆర్యన్
{{/usCountry}}మరోవైపు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 'చందూ ఛాంపియన్' సినిమాలో కనబరిచిన అద్భుత నటనకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. నల్లటి క్లాసీ సూట్‌లో ఎంతో డాషింగ్‌గా కనిపించిన కార్తీక్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేముందు ఆడిటోరియంలోని ప్రేక్షకులకు నమస్కరిస్తూ అభివాదం చేశారు.
భారత తొలి పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ బయోపిక్‌గా ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని చెక్కారు. ఈ పాత్ర కోసం కార్తీక్ పడిన ఫిజికల్ కష్టం, అంకితభావం, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియన్స్‌ని, జ్యూరీ సభ్యులను ఎంతగానో మెప్పించింది.
చందూ ఛాంపియన్‌పై కార్తీక్ ఆనందం
అవార్డ్ అందుకున్న అనంతరం కార్తీక్ మాట్లాడుతూ, "చందూ ఛాంపియన్ మూవీకి నాకు తొలి నేషనల్ అవార్డ్ రావడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. మా ఫ్యామిలీ, టీమ్ అంతా పండగ చేసుకుంటున్నారు. పారా అథ్లెట్లకు ఈ సినిమా ఇచ్చిన స్పూర్తి ఎంతో గొప్పది. మమ్మల్ని ఎన్నుకున్న జ్యూరీకి, ఆదరించిన ఇండియన్ ఆడియన్స్‌కి నా థ్యాంక్స్" అని చెప్పారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శన, అక్కడ రుచికరమైన లోకల్ ఫుడ్ తిన్న ఫోటోలను కూడా కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.