ఏపీలో పెరిగిన మన శంకరవరప్రసాద్ గారు టికెట్ల ధరలు.. స్పెషల్ ప్రీమియర్ షోలకు ఇలా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చివరి నిమిషంలో ఎలాంటి గందరగోళం లేకుండా మూడు రోజుల ముందే అనుమతి రావడం గమనార్హం.

Published on: Jan 9, 2026, 20:44:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈసారి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా శుక్రవారం (జనవరి 9) ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏ పెద్ద సినిమా వస్తున్నా టికెట్ల పెంపు జీవోలు సాధారణంగా మారిపోయాయి.

ఏపీలో పెరిగిన మన శంకరవరప్రసాద్ గారు టికెట్ల ధరలు.. స్పెషల్ ప్రీమియర్ షోలకు ఇలా..
ఏపీలో పెరిగిన మన శంకరవరప్రసాద్ గారు టికెట్ల ధరలు.. స్పెషల్ ప్రీమియర్ షోలకు ఇలా..

ఏపీలో టికెట్ల ధరలు ఇలా..

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ టికెట్ల ధరలు పెరిగాయి. జనవరి 12న మూవీ రిలీజ్ కానుంగా.. జనవరి 11న రాత్రి వేయబోయే స్పెషల్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. ఇక రిలీజ్ రోజు నుంచి మొదటి పది రోజుల వరకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చారు.

సింగిల్ స్క్రీన్ అయితే రూ.100, మల్టీప్లెక్స్ అయితే రూ.125 పెంచుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.247, మల్టీప్లెక్స్ లో రూ.302కు చేరనుంది. అంతేకాదు ఈ పది రోజులు రోజుకు ఐదు షోలకు కూడా అనుమతి ఇవ్వడం విశేషం.

మన శంకరవరప్రసాద్ గారు విశేషాలు

చిరు, అనిల్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. అందులోనూ సంక్రాంతి సమయంలో ఈ మన శంకరవరప్రసాద్ గారు వస్తుండటంతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో హిట్ పడినట్లే అని ముందుగానే ఫ్యాన్స్ డిసైడయ్యారు. ఇక ది రాజా సాబ్ కు వస్తున్న మిక్స్‌డ్ రివ్యూలు కూడా ఈ సినిమాకు కలిసి రానున్నాయి.

మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో నటించాడు. అతని ఎక్స్‌టెండెడ్ కామియో రోల్ చాలా ఆసక్తి రేపుతోంది. గతేడాది వెంకీతోనే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల మూవీని నిర్మించారు.

మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి తనదైన స్టైల్ ప్రమోషన్లు ప్లస్ కానున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెసైంది. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More