మెగాస్టారా మజాకా.. యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్.. 24 గంటల్లోనే ఎన్ని వ్యూస్ అంటే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. తొలి 24 గంటల్లోనే ఈ ట్రైలర్ కు 25 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇది మేకర్స్ లో మరింత ఉత్సాహం ఇస్తోంది.

Published on: Jan 5, 2026, 17:34:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు కూడా ఎంతో ఆసక్తి రేపుతోంది. అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మూవీ ట్రైలర్ వచ్చీరాగానే యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.

మెగాస్టారా మజాకా.. యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్.. 24 గంటల్లోనే ఎన్ని వ్యూస్ అంటే.. (x/Shine_Screens)
మెగాస్టారా మజాకా.. యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్.. 24 గంటల్లోనే ఎన్ని వ్యూస్ అంటే.. (x/Shine_Screens)

ట్రైలర్ రికార్డులు

చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ ఆదివారం (జనవరి 4) రిలీజైన విషయం తెలుసు కదా. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో, వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ సాగిపోయిన ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో రెండో స్థానంలో ఉన్న ఈ ట్రైలర్ కు తొలి 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇందులో చిరంజీవితోపాటు వెంకటేశ్ కూడా అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ట్రైలర్లో అతని ఎంట్రీ మరింత ఆసక్తి రేపింది.

మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు.

‘‘ఇంటిలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ ను అయినా ఉతికి, పిండి ఆరేస్తారు. తప్పు చేసినోన్ని కోసి కారం పెడతారు’’ అని బ్యాక్ గ్రౌండ్ లో ఎలివేషన్ వస్తుంటే చిరు మాత్రం బట్టలు ఉతుకుతూ, వంకాయ మసాల కర్రీ చేస్తూ కనిపించాడు.

నయనతారతో చిరంజీవి లవ్ సీన్లు కూడా ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత భార్య టార్చర్ కు చిరులో కనిపించే ఫ్రస్టేషన్ కామెడీ పండిస్తుంది. మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరుపు బంధువులను, మరీ ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా అని చిరు తెగ సంబరపడిపోతాడు.

ట్రైలర్ చివర్లో హెలికాప్టర్ లో వెంకటేష్ ఎంట్రీ అదిరిపోయింది. చిరు, వెంకీ కౌంటర్లు కూడా బాగా పేలాయి. ‘‘చూడటానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావ్. ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటీ’’ అని చిరు అంటే.. ‘‘మాస్ కే బాస్ లా ఉన్నావ్. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటీ’’ అని వెంకీ అంటాడు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరీన్ తదితరులు నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్టర్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More