మీవే తప్పుడు ట్రైలర్స్.. ఆ రివ్యూలే కాపాడేవి.. ఎందుకంత అభద్రతా భావం: చిరు మూవీ మేకర్స్‌పై ఫ్యాన్స్ సీరియస్.. కారణమిదీ
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ మన శంకరవరప్రసాద్ గారుకి బుక్ మై షోలో రివ్యూలు, రేటింగ్స్ నిషేధించడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు. కోర్టు ఆదేశం ప్రకారం ఈ పని చేసినా.. మీకు ఎందుకింత అభద్రతా భావం అంటూ మేకర్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా రేపు అంటే సోమవారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ (BookMyShow)లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్ సెక్షన్‌ను బుక్‌మైషో నిలిపివేసింది.

కోర్టు ఆర్డర్ వల్లే..
ప్రస్తుతం బుక్‌మైషో యాప్‌లో మన శంకరవరప్రసాద్ గారు పేజీని ఓపెన్ చేస్తే.. "కోర్టు ఆదేశాల మేరకు రేటింగ్స్ & రివ్యూలు డిసేబుల్ చేయబడ్డాయి" అనే సందేశం కనిపిస్తోంది. సాధారణంగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఇది వేదికగా ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఆ వెసులుబాటు లేదు. 2 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UA 13+ సర్టిఫికెట్ జారీ చేసింది. కుటుంబ బంధాలు, హై-వోల్టేజ్ కాన్‌ఫ్లిక్ట్ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ థ్రిల్లర్‌లో విక్టరీ వెంకటేశ్ కూడా అతిథి పాత్రలో మెరవనున్నాడు.
అభద్రతా భావమా? లేక ఫేక్ రివ్యూల భయమా?
ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ‘రెడిట్’ (Reddit)లో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
"అనిల్ రావిపూడి సినిమాలు చూసే ఆడియన్స్ బుక్‌మైషోలో రివ్యూలు రాయరు.. అందుకే ఫేక్ రివ్యూలతో సినిమాను దెబ్బతీస్తారనే భయంతో ఇలా చేసి ఉంటారు" అని కొందరు వెనకేసుకొస్తున్నారు.
"పరిశ్రమలో ఎంత అభద్రతా భావం ఉందో దీన్ని చూస్తే అర్థమవుతోంది. టికెట్ కొన్నవాళ్లు మాత్రమే రివ్యూ రాసే అవకాశం ఉన్నప్పుడు.. జెన్యూన్ ఆడియన్స్ గొంతు నొక్కడం ఎందుకు?" అని మరికొందరు మండిపడుతున్నారు.
"ట్రైలర్లతో మభ్యపెట్టడం మీ హక్కు అయినప్పుడు.. రివ్యూలతో మిమ్మల్ని జడ్జ్ చేయడం మా హక్కు. బాట్స్ సమస్య ఉంటే టెక్నాలజీతో పరిష్కరించాలి కానీ.. ఇలా మొత్తం రివ్యూలే ఆపేయడం ఏంటి?" అని ఇంకొకరు ప్రశ్నించారు.
అవతార్ 3 కంటే అఖండకే ఎక్కువ రేటింగ్
గతంలో బుక్‌మైషో రేటింగ్స్ తీరుపై ఒక నెటిజన్ సెటైర్ వేస్తూ.. "ఇక్కడ అవతార్ 3 కంటే అఖండకే ఎక్కువ రేటింగ్ వచ్చింది.. అందుకే ఇవన్నీ నమ్మలేం" అని చమత్కరించారు. "ఇక లెటర్‌బాక్స్‌డ్ (Letterboxd) యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే" అని మరొకరు జోక్ చేశారు. వినియోగదారులు తమ ప్రొడక్ట్ గురించి రేటింగ్ ఇవ్వకుండా ఆపడం సెలబ్రిటీల అహంకారానికి నిదర్శనమని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన ‘ది డెవిల్’ సినిమా విషయంలోనూ కోర్టు ఆదేశాల మేరకు బుక్‌మైషో ఇలాగే రేటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


