అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు తిరగరాస్తున్న మన శంకరవరప్రసాద్ గారు.. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ సునామీ
బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మానియా మొదలైంది. సోమవారం (జనవరి 12) అతడు నటించిన మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్ కాబోతోండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తొలి 24 గంటల్లోనే లక్షకుపైగా టికెట్లు అమ్ముడవడం విశేషం.
సంక్రాంతి సినిమా.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్.. మధ్యలో గెస్ట్ గా వస్తున్న విక్టరీ వెంకటేశ్.. ఇంకేం పండగంతా థియేటర్లలోనే ఉండబోతోంది. మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగానే రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజా సాబ్‌కు వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలు కూడా చిరుకి కలిసి వస్తున్నట్లుగా ఉంది.

మన శంకరవరప్రసాద్ గారు అడ్వాన్స్ బుకింగ్స్
చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. తొలి 24 గంటల్లోనే బుక్ మై షోలో ఏకంగా లక్షా 8 వేలకుపైగా టికెట్లు అమ్ముడు పోవడం విశేషం.
ప్రస్తుతం ఈ పోర్టల్ లో మూవీ ట్రెండింగ్ లో ఉంది. సుమారు 2.84 లక్షల మంది మూవీపై ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు కూడా గంటకు సగటును 11 వేల టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఈ సినిమాను ఫ్యామిలీ, థ్రిల్లర్ గా బుక్ మై షో చూపించింది. 2 గంటల 44 నిమిషాల భారీ రన్‌టైమ్ తో వస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారుపై భారీ అంచనాలు
గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ చూశాం కదా. దీంతో మన శంకరవరప్రసాద్ గారుపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి, నయనతార, అతిథిపాత్రలో వెంకటేశ్ అనే పాయింట్ ఒకటి కాగా.. అనిల్ మార్క్ కామెడీ మరో పాయింట్.
ఇక ప్రభాస్ ది రాజా సాబ్ చాలా వరకు నిరాశ పరిచిన నేపథ్యంలోనూ ఈ సినిమాపై జనాల ఆసక్తి పెరిగింది. ఈ పండగపూట మంచి నవ్వులు పంచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారే అని ప్రేక్షకులు నమ్ముతున్నట్లు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.
సినిమా కంటే తన ప్రమోషన్లతోనే ఎక్కువగా ఆకట్టుకునే అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. మూవీ టీమ్ నుంచి వచ్చిన కంటెంట్ మొత్తం బాగా ఆకట్టుకుంది. లేటెస్ట్ రిలీజ్ చేసిన చిరంజీవి హుక్ స్టెప్ తో అభిమానుల ఆశలు రెట్టింపయ్యాయి. వింటేజ్ చిరుని చూడబోతున్నట్లుగా దీనితోనే తేలిపోయింది. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సోమవారం (జనవరి 12) థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


