టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సంక్రాంతి సెలవులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంది. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ రూ. 300 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది.
7వ రోజు కూడా తగ్గని జోరు..

బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా వారం మొత్తం నిలకడగా రాణించింది. 7వ రోజు (ఆదివారం) ఇండియాలో రూ. 17.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 157.75 కోట్లకు (గ్రాస్ రూ. 189 కోట్లు) చేరాయి. ఓవర్సీస్‌లోనూ సుమారు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 225 కోట్లు దాటగా.. చిత్ర నిర్మాతలు మాత్రం ఇప్పటికే రూ. 292 కోట్లు వసూలయ్యాయని పోస్టర్స్ ద్వారా చెబుతుండటం విశేషం. ఒక రీజినల్ సినిమాకు ఫస్ట్ వీక్‌లో ఇవి రికార్డు స్థాయి వసూళ్లు.
“ప్రతి థియేటర్, ప్రతి కేంద్రం.. ప్రతి ప్రాంతం, ప్రతి గుండె.. ది స్వాగ్ కా బాప్ అన్నింటినీ జయించాడు.. మన శంకరవరప్రసాద్ గారికి మొదటి వారంలోనే రూ.292 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్.. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్ 2వ వారంలోకి ప్రవేశించింది” అనే క్యాప్షన్ తో షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది.
‘రాజా సాబ్’ను దాటేసిన మెగాస్టార్
ఈ సంక్రాంతికి వచ్చిన మరో భారీ బడ్జెట మూవీ, ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ వసూళ్లను చిరు సినిమా అధిగమించింది. ‘రాజా సాబ్’ నెగెటివ్ టాక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్ల వద్ద నెమ్మదించింది. కానీ చిరంజీవి సినిమా మూడు రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ (జనవరి 12న), తక్కువ ఓపెనింగ్స్‌తో మొదలై.. ఇప్పుడు ప్రభాస్ సినిమాను క్రాస్ చేసింది. గత వీకెండ్లో చిరు సినిమా ఇండియాలో రూ. 55 కోట్లు రాబట్టగా, ప్రభాస్ సినిమా కేవలం రూ. 9 కోట్లకు పరిమితమైంది.
{{/usCountry}}ఈ సంక్రాంతికి వచ్చిన మరో భారీ బడ్జెట మూవీ, ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ వసూళ్లను చిరు సినిమా అధిగమించింది. ‘రాజా సాబ్’ నెగెటివ్ టాక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 201 కోట్ల వద్ద నెమ్మదించింది. కానీ చిరంజీవి సినిమా మూడు రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ (జనవరి 12న), తక్కువ ఓపెనింగ్స్‌తో మొదలై.. ఇప్పుడు ప్రభాస్ సినిమాను క్రాస్ చేసింది. గత వీకెండ్లో చిరు సినిమా ఇండియాలో రూ. 55 కోట్లు రాబట్టగా, ప్రభాస్ సినిమా కేవలం రూ. 9 కోట్లకు పరిమితమైంది.
{{/usCountry}}సినిమా విశేషాలు నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.