Trisha Manchu Lakshmi: నీకు డబుల్ సెలబ్రేషన్స్, బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇదే.. త్రిష పుట్టినరోజుకు మంచు లక్ష్మీ ట్వీట్!

Manchu Lakshmi Trisha Birthday Wishes: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించింది. ఇదే సమయంలో హీరోయిన్ త్రిష పుట్టినరోజు కూడా కావడంతో మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు. నీకు డబుల్ సెలబ్రేషన్స్, బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: May 5, 2026, 06:30:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manchu Lakshmi Birthday Wishes To Trisha: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం (మే 4) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ అద్భుతమైన విజయం సాధించారు. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకుని నెంబర్ వన్‌గా నిలిచింది.

నీకు డబుల్ సెలబ్రేషన్స్, బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇదే.. త్రిష పుట్టినరోజుకు మంచు లక్ష్మీ ట్వీట్!
నీకు డబుల్ సెలబ్రేషన్స్, బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇదే.. త్రిష పుట్టినరోజుకు మంచు లక్ష్మీ ట్వీట్!

తొలి ప్రయత్నంలోనే

తొలి ప్రయత్నంలోనే దళపతి విజయ్ ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. నీలాంకరైలోని విజయ్ నివాసం వద్ద అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

తిరుమల దర్శనం.. ఆపై విజయ్ ఇంటికి త్రిష

మే 4న హీరోయిన్ త్రిష 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆమెకు అలవాటు. అందులో భాగంగానే సోమవారం ఉదయం తెల్లటి కుర్తా ధరించి స్వామివారిని దర్శించుకున్న త్రిష, మధ్యాహ్నం నేరుగా చెన్నై చేరుకున్నారు.

ఆకుపచ్చ రంగు దుస్తుల్లో

నీలాంకరైలోని విజయ్ బీచ్ ఫ్రంట్ మాన్షన్‌కు త్రిష చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కారులో విజయ్ ఇంటికి వెళ్తున్న త్రిషను చూసి అక్కడున్న మీడియా ప్రతినిధులు పలకరించే ప్రయత్నం చేసినా, ఆమె కేవలం చిరునవ్వు చిందిస్తూ లోపలికి వెళ్లిపోయారు.

మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్

ఇదిలా ఉంటే, త్రిష పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "అందమైన త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ వేడుక చేసుకోవడానికి ఇంతకంటే మంచి రోజు దొరకదు. నాకు తెలిసి ఆ విశ్వమే నీకు ఈ భారీ విజయంతో బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంది. నీకు ఇవాళ డబుల్ సెలబ్రేషన్స్!" అంటూ మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

వెండితెరపై మ్యాజిక్.. నిజజీవితంలో రూమర్స్

దళపతి విజయ్ సాధించిన ఎన్నికల విజయాన్ని ఉద్దేశిస్తూ మంచు లక్ష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే, విజయ్-త్రిష జోడీకి కోలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'గిల్లి', 'తిరుపాచ్చి', 'ఆతి', 'కురువి' వంటి హిట్ చిత్రాల తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని 'లియో' చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు.

విడాకుల వరకు

ఆ మధ్య వచ్చిన విజయ్ 'ది గోట్'లో కూడా ఒక ప్రత్యేక గీతంలో త్రిష మెరిశారు. అయితే, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 1999లో సంగీతను వివాహం చేసుకున్న విజయ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, ఇటీవల విజయ్ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని, విడాకుల వరకు వెళ్లిందనే పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో, త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం చర్చకు దారితీస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ (TVK) ఎన్ని స్థానాల్లో గెలిచింది?

విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది.

2. నటి త్రిష పుట్టినరోజు ఎప్పుడు?

నటి త్రిష మే 4న తన 43వ పుట్టినరోజును జరుపుకున్నారు.

3. విజయ్, త్రిష కలిసి నటించిన సినిమాలు ఏవి?

వీరిద్దరూ గిల్లి, తిరుపాచ్చి, ఆతి, కురువి మరియు ఇటీవల వచ్చిన లియో వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.

4. మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ఉద్దేశ్యం ఏమిటి?

త్రిష పుట్టినరోజు, విజయ్ పార్టీ ఎన్నికల్లో సాధించిన భారీ విజయాన్ని కలిపి 'డబుల్ సెలబ్రేషన్స్' అంటూ మంచు లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More