Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ప్రభంజనం- సినీ కెరీర్ నుంచి రాజకీయ విమర్శల వరకు!
Thalapathy Vijay TVK In Tamil Nadu Elections: తమిళంలో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకుని దళపతిగా ఎదిగిన విజయ్ టీవీకే పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం చూపిస్తున్నారు. అనూహ్య ఫలితాలతో ప్రత్యర్థులను భయపెడుతున్నారు. అలాంటి దళపతి విజయ్ సినీ కెరీర్ నుంచి రాజకీయ విమర్శల వరకు లుక్కేద్దాం.
Thalapathy Vijay TVK In Tamil Nadu Elections: సినిమా తెరపై తన డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనూహ్య ఫలితాలతో దూసుకుపోతోంది.

తెరపై 'పోకిరి'.. తీర్పులో 'నాయకుడు'
"ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను" - ఇది తెలుగు రీమేక్ అయిన 'పోకిరి' సినిమాలో విజయ్ చెప్పిన ఫేమస్ డైలాగ్. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించినప్పుడు, ఆయన ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో నేటి ఫలితాలు నిరూపిస్తున్నాయి.
సోమవారం (మే 4) ఉదయం 11 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తన సినిమాలకు వచ్చే భారీ వసూళ్లను, అభిమానగణాన్ని విజయ్ విజయవంతంగా ఓట్లుగా మలుచుకోగలిగారు.
వెండితెర నుంచి రాజకీయ రణరంగం వరకు
1974లో చెన్నైలో జన్మించిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తండ్రి దర్శకత్వంలో 'వెట్రి' (1984) చిత్రంతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్, 1992లో 'నాళయ తీర్పు'తో హీరోగా మారారు.
అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల హవా నడుస్తున్నా, 'పూవే ఉనక్కాగ' (1996) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాల సంగీతంలో పాటలు పాడి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. అయితే, రాజకీయాల కోసం తన సినీ కెరీర్‌ను త్యాగం చేస్తానని, 'జననాయగన్' తన చివరి సినిమా అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పోరాటాల ప్రస్థానం.. సవాళ్లు దాటుకుంటూ..
దళపతి విజయ్ రాజకీయ ప్రయాణం 2009లో 'విజయ్ మక్కల్ ఇయక్కం' స్థాపనతోనే మొదలైంది. 2022 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం సభ్యులు 115 సీట్లు గెలుచుకోవడం ద్వారా దళపతి పొలిటికల్ పవర్ ఏంటో తొలిసారి తెలిసింది. 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా 'టీవీకే' పార్టీని ప్రకటించిన ఆయన, డీఎంకేను 'రాజకీయ శత్రువు'గా, బీజేపీని 'సైద్ధాంతిక శత్రువు'గా అభివర్ణించారు.
అవినీతి రహిత పాలన, సామాజిక న్యాయం, ద్విభాషా సూత్రం వంటి నినాదాలతో ప్రజల్లోకి వెళ్లారు దళపతి. అయితే, ఈ ప్రయాణం సాఫీగా ఏమీ సాగలేదు. కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మింది. అలాగే, హీరోయిన్ త్రిషతో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని చాలా పుకార్లు సైతం వచ్చిన విషయం తెలిసిందే.
ప్రత్యర్థుల విమర్శలు, సీబీఐ విచారణ వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా 234 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టి స్వయంగా ప్రచారాన్ని హోరెత్తించారు దళపతి విజయ్.
డీఎంకేకు గట్టి పోటీ.. మారుతున్న ముఖచిత్రం
తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల లెక్కలను విజయ్ మార్చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోటయ్యన్ వంటి వారు టీవీకేలో చేరడం ఆ పార్టీకి పెద్ద బూస్ట్‌నిచ్చింది. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే, అధికార డీఎంకేకు విజయ్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది.
తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ వంటి కీలక స్థానాల నుంచి పోటీ చేసిన దళపతి విజయ్, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


