Manchu Manoj: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన కథలు, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కిస్తున్నారు.
కొత్త గెటప్ లో మంచు మనోజ్

RPA క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ను మునుపెన్నడూ చూడని కొత్త రూపంలో ఆడియన్స్ చూడబోతున్నారని టాక్. ‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్పీ అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పూరి శిష్యుడు
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు మంచు మనోజ్ తన కెరీర్ లో చేయని కొత్త పాత్ర ఇది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సరికొత్త అవతార్‌లో మంచు మనోజ్ అదరగొడతారని అంటున్నారు.
పోతరాజు బ్యాక్ డ్రాప్ లో
పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
{{/usCountry}}ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
మంచు మనోజ్ సినిమాలు
మధ్యలో ఏడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ తిరిగి 2025లో భైరవం మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మిరాయ్ లో విలన్ గా అదరగొట్టారు. బ్లాక్ స్వార్డ్ గెటప్ లో యాక్టింగ్ ఇరగదీశారు. ఈ మూవీ సక్సెస్ తో మంచు మనోజ్ కెరీర్ మరో టర్న్ తీసుకుంది.
ఇప్పుడు మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసుల వాడ, అహం బ్రహ్మాస్మి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇక బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న దాదా మూవీతో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసింది.