Netflix Trending: ఈ తమిళ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఎగబడి చూస్తున్న జనాలు.. ఓటీటీలో గ్లోబల్ ట్రెండింగ్.. మస్ట్ వాచ్!
Netflix Trending: తమిళ సినిమా ‘మండాడి’ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఈ మూవీని ఓటీటీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. దీంతో ఓటీటీలో గ్లోబల్ ట్రెండింగ్ లో ఈ మూవీ మూడో స్థానానికి చేరుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Netflix Trending: థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి పక్కా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచిన తమిళ సినిమా ‘మండాడి’ ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిజిటల్ స్క్రీన్‌పై కూడా బిగ్గెస్ట్ మనీ స్పిన్నర్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా సాధిస్తున్న వ్యూయర్ షిప్ నెంబర్లే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ 3
అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకూ సంబంధించిన గ్లోబల్ టాప్ చార్ట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో నాన్-ఇంగ్లీష్ (Non-English) సినిమాల కేటగిరీలో ‘మండాడి’ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ వారం వ్యవధిలోనే ఈ సినిమాకు ఏకంగా 22 లక్షల వ్యూస్ రావడం విశేషం.
ఒకటే సినిమా
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ఇండియా నుంచి మండాడి టాప్ లో ఉంది. అలాగే ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక సౌత్ ఇండియా మూవీ అదే. దీన్ని బట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మందాడి ఎంతలా అదరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.
హోమ్ ఆడియన్స్‌కు ఫేవరెట్
ఈ మండాడి సినిమా ఓటీటీలోకి వచ్చిన మొదటి నాలుగు రోజుల్లో ఎలాంటి వ్యూస్ సాధించిందో, అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగిస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మల్టీపుల్ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ మూవీ.. ఓటీటీ హోమ్ ఆడియన్స్‌కు మోస్ట్ ఫేవరెట్ చాయిస్‌గా మారిపోయింది.
ఎందుకు మస్ట్ వాచ్?
మండాడి సినిమాను ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాలనేందుకు కొన్ని కారణాలున్నాయి. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి తనదైన సహజ నటనతో మెప్పించగా, విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో సుహాస్ ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టారు.
పడవ పందేలు అనే డిఫరెంట్ స్టోరీ లైన్, సత్యరాజ్ పవర్‌ఫుల్ పాత్ర, కట్టిపడేసే కథ, ఆసక్తికరమైన కథనం కోసం ఈ మండాడి మూవీని ఓటీటీలో చూడొచ్చు.
బ్లాక్ బస్టర్
థియేటర్లలో మండాడి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విలక్షణమైన కథా చిత్రాన్ని దర్శకుడు మతిమారన్ పుగజేంది అద్భుతంగా తెరకెక్కించారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ (RS Infotainment) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సూరి, సుహాస్‌లతో పాటు సీనియర్ నటుడు సత్యరాజ్, మహిమ నంబియార్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


