Movie Ticket: ఈ వారం (జూన్ 12, 2026) బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో మూవీ లవర్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.

ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో వస్తున్న 'మై వాపస్ ఆవుంగా', కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత', విక్రమ్ భట్ హారర్ మూవీ 'హాంటెడ్ 3డీ: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' చిత్రాలతో పాటు వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ నటించిన 'గవర్నర్' (Governor) ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇంతటి భారీ కాంపిటీషన్ తట్టుకుని నిలబడేందుకు, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు 'గవర్నర్' మూవీ టీమ్ ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది.
1990s Ticket Price | 1990ల నాటి ధరకే సినిమా టికెట్
ప్రస్తుత రోజుల్లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడికి పెద్ద భారంగా మారాయి. ఇలాంటి టైమ్ లో ఈ ఎకనామిక్ థ్రిల్లర్ సినిమాను అందరికీ రీచ్ అయ్యేలా చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా మొదటి 25,000 టికెట్లను కేవలం రూ. 50 లకే ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
1990వ సంవత్సరంలో ఇండియాలో యావరేజ్ గా ఒక సినిమా టికెట్ ధర యాభై రూపాయల రేంజ్ లో ఉండేది. ఆ రోజులను గుర్తుచేస్తూ.. ఆడియన్స్ 'BookMyShow' యాప్‌లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు 'GOVERNOR90' అనే కూపన్ కోడ్‌ను వాడితే ఈ క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. భారీ కాంపిటీషన్ ఉన్న టైమ్ లో ఇదొక సూపర్బ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. దేశ ఆర్థిక చరిత్రలో మైలురాయిలాంటి ఘట్టాన్ని అత్యంత తక్కువ ధరకే థియేటర్లలో చూసే ఛాన్స్ ఈ ఆఫర్ ద్వారా దక్కుతోంది.
Governor Movie Plot | దేశాన్ని కాపాడిన ఆర్‌బీఐ గవర్నర్ రియల్ స్టోరీ
ఈ సినిమా స్టోరీ ఆడియన్స్ ను 1990ల నాటి క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళుతుంది. అప్పట్లో ఇండియా తీవ్రమైన విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) సంక్షోభాన్ని ఫేస్ చేసింది. దేశంలో ఉన్న విదేశీ నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేలా పడిపోయాయి. దేశం దివాలా తీసే డేంజర్ లో పడిన ఆ కాలంలో.. కొత్తగా అపాయింట్ అయిన ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడారనే యథార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మనోజ్ బాజ్‌పాయ్ ఆ ఆర్‌బీఐ గవర్నర్ క్యారెక్టర్ లో జీవించేశారు.
దేశ సార్వభౌమత్వాన్ని, ఎకానమీని నిలబెట్టడానికి తెరవెనుక జరిగిన ప్లాన్స్, ఎదురైన ఛాలెంజెస్, ఆ చారిత్రాత్మక సంక్షోభాన్ని అధిగమించిన తీరును సిల్వర్ స్క్రీన్ పై చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. ఈ స్టోరీ ప్రెజెంట్ జనరేషన్ యూత్ కి మన దేశ ఆర్థిక సంస్కరణల (Liberalization) ఇంపార్టెన్స్ ను చక్కగా వివరిస్తుంది.
గవర్నర్ మూవీ విశేషాలు
{{/usCountry}}దేశ సార్వభౌమత్వాన్ని, ఎకానమీని నిలబెట్టడానికి తెరవెనుక జరిగిన ప్లాన్స్, ఎదురైన ఛాలెంజెస్, ఆ చారిత్రాత్మక సంక్షోభాన్ని అధిగమించిన తీరును సిల్వర్ స్క్రీన్ పై చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. ఈ స్టోరీ ప్రెజెంట్ జనరేషన్ యూత్ కి మన దేశ ఆర్థిక సంస్కరణల (Liberalization) ఇంపార్టెన్స్ ను చక్కగా వివరిస్తుంది.
గవర్నర్ మూవీ విశేషాలు
{{/usCountry}}"దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఆనాటి సంక్షోభాన్ని కళ్లకు కట్టేందుకు, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను నిర్మించాం," అని ప్రొడ్యూసర్ విపుల్ అమృత్‌లాల్ షా చెప్పారు. చిన్మయ్ మాండ్లేకర్ మూవీని డైరెక్ట్ చేశాడు. మనోజ్ బాజ్‌పాయ్, అదా శర్మ, నౌషాద్ మహ్మద్ కుంజు, మధు షా నటించారు. ఈ గ్రిప్పింగ్ డ్రామాకు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది తనదైన స్టైల్లో అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
People Also Ask (FAQs)
'గవర్నర్' సినిమా టికెట్‌ను రూ. 50 కే ఎలా బుక్ చేసుకోవాలి?
ఆడియన్స్ బుక్‌మైషో (BookMyShow) లో టికెట్లు బుక్ చేసే టైమ్ లో 'GOVERNOR90' అనే కూపన్ కోడ్‌ను వాడి ఫస్ట్ 25,000 టికెట్లను కేవలం రూ. 50 లకే సొంతం చేసుకోవచ్చు.
మనోజ్ బాజ్‌పాయ్ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ప్లే చేశారు?
1990ల నాటి భారత ఆర్థిక సంక్షోభం బ్యాక్ డ్రాప్ లో కొత్తగా అపాయింట్ అయిన ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ పవర్ ఫుల్ పాత్రను మనోజ్ బాజ్‌పాయ్ పోషించారు.
'గవర్నర్' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇందులో నటించిన ఇతర నటులు ఎవరు?
ఈ ఎకనామిక్ థ్రిల్లర్ సినిమా జూన్ 12, 2026న రిలీజ్ అవుతోంది. ఇందులో అదా శర్మ, మధు షా కీలక పాత్రల్లో నటించగా.. చిన్మయ్ డి. మాండ్లేకర్ దీనికి డైరెక్టర్ గా వ్యవహరించారు.