OTT Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.1594 కోట్ల ఆస్కార్ క్రేజీ మూవీ.. గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్.. తెలుగులోనూ
OTT Thriller: హాలీవుడ్ స్టార్ తిమోతీ చాలమేట్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1594 కోట్ల కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ ఆస్కార్ లో 9 విభాగాల్లో పోటీపడింది.
OTT Thriller: అవార్డుల సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ప్రతిష్టాత్మక చిత్రం 'మార్టీ సుప్రీమ్' (Marty Supreme) ఎట్టకేలకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇవాళ (మే 16) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు జోష్ సఫ్దీ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మార్టీన్ సుప్రీమ్ ఓటీటీ
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్టీన్ సుప్రీమ్’ ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీలో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1594 కోట్లు కలెక్ట్ చేసింది.
ఆస్కార్ రేసులో సంచలనం
మార్టీ సుప్రీమ్ చిత్రం 98వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ 2026) ఏకంగా 9 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రం, తిమోతీ చాలమేట్‌కు ఉత్తమ నటుడు, జోష్ సఫ్దీకి ఉత్తమ దర్శకుడు, అలాగే సఫ్దీ-బ్రాన్‌స్టెయిన్‌లకు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కాయి.
ఆస్కార్ వేదికపై ఒక్క అవార్డు కూడా గెలవలేకపోయినప్పటికీ, ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా మార్టీ సుప్రీమ్ నిలిచింది. అయితే, ఈ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ కథానాయకుడు తిమోతీ చాలమేట్ తన కెరీర్‌లో తొలి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.
స్టోరీ ఏమిటంటే?
1950ల నాటి న్యూయార్క్ నగరం నేపథ్యంలో ఈ మార్టీ సుప్రీమ్ సినిమా కథ నడుస్తుంది. మార్టీ మౌజర్ (తిమోతీ చాలమేట్) ఓ సాధారణ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. ప్రపంచ ఛాంపియన్ కావాలనుకుంటాడు. ఆ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే మార్టీ సుప్రీమ్ కథ. మధ్యలో డబ్బు చుట్టూ తిరిగే నేపథ్యం థ్రిల్ అందిస్తుంది. అప్పుడు గూస్ బంప్స్ గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో తిమోతీ చాలమేట్‌తో పాటు గ్వినేత్ పాల్ట్రో, ఒడెస్సా అజియాన్, కెవిన్ ఒలీరీ, టైలర్ ఒకొన్మా (టైలర్, ది క్రియేటర్), అబెల్ ఫెరారా, ఫ్రాన్ డ్రెషర్, లూక్ మాన్లీ, కోటో కావగ్యుచి వంటి స్టార్లు నటించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. 'మార్టీ సుప్రీమ్' సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
భారత్‌లో ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
2. 'మార్టీ సుప్రీమ్' చిత్రానికి ఏవైనా అవార్డులు వచ్చాయా?
ఈ సినిమా ఆస్కార్ 2026లో 9 నామినేషన్లు దక్కించుకున్నప్పటికీ అవార్డులు గెలవలేదు. కానీ, ప్రధాన పాత్ర పోషించిన తిమోతీ చాలమేట్ ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు.
4. ఈ చిత్రం తెలుగు ఆడియోలో అందుబాటులో ఉందా?
అవును, ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


