ఓటీటీలోని ఈ మలయాళ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దంటూ నెటిజన్ల రివ్యూలు.. ట్విస్టులు లేకుండానే థ్రిల్ పంచుతున్న పాతిరాత్రి

ఓటీటీలోకి తాజాగా వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి (Paathirathri)పై ఎక్స్ లో నెటిజన్లు ఇస్తున్న రివ్యూలు వైరల్ అవుతున్నాయి. అసలు ట్విస్టులు లేకుండానే మంచి థ్రిల్ పంచుతోందని వాళ్లు చెబుతున్నారు.

Feb 21, 2026, 07:49:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవ్యా నాయర్, సౌబిన్ షాహిర్ పోలీస్ ఆఫీసర్లుగా నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి' (Paathirathri). థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 20) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఈ పోలీస్ డ్రామాను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ పాజిటివ్ రివ్యూలను పంచుకుంటున్నారు.

ఓటీటీలోని ఈ మలయాళ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దంటూ నెటిజన్ల రివ్యూలు.. ట్విస్టులు లేకుండానే థ్రిల్ పంచుతున్న పాతిరాత్రి
ఓటీటీలోని ఈ మలయాళ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దంటూ నెటిజన్ల రివ్యూలు.. ట్విస్టులు లేకుండానే థ్రిల్ పంచుతున్న పాతిరాత్రి

పాతిరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చే థ్రిల్లర్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి'. అంటే తెలుగులో అర్ధరాత్రి అని అర్థం. టైటిల్ కు తగినట్లే ఓ అర్ధరాత్రి ఇద్దరు పోలీసుల జీవితాలను ఎలా మార్చేసిందన్నది ఈ మూవీ స్టోరీ. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 20న ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

రొటీన్ ట్విస్టులు లేని ఎంగేజింగ్ థ్రిల్లర్

ఈ సినిమాకు ఆన్‌లైన్‌లో ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఎంక్వయిరీ చుట్టూ ఉండే వాస్తవిక అంశాలను, ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే రొటీన్ ట్విస్ట్‌లు లేకుండా, ఎంగేజింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కించినందుకు దర్శకురాలిని అభినందిస్తున్నారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ (ఎస్ఐ ఝాన్సీ) పాత్ర పోషించిన నవ్యా నాయర్ నటనకు విశేష స్పందన లభిస్తోంది. అలాగే కానిస్టేబుల్ హరీష్ పాత్రలో సౌబిన్ షాహిర్ నటన సినిమాకు అవసరమైన ఎమోషనల్ డెప్త్‌ను ఇచ్చిందని మెచ్చుకుంటున్నారు.

"నైట్ పెట్రోలింగ్ సన్నివేశాల్లోని రియలిజం అద్భుతంగా హైలైట్ అయింది" అని ఒక యూజర్ ‘ఎక్స్’లో కామెంట్ చేశారు. కథను నడిపించిన తీరు, పాత్రల భావోద్వేగాలు ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయని కొనియాడుతున్నారు.

పాత్రిరాత్రి కథ, ఇతర విశేషాలు

మమ్ముట్టి 'పురు' (Puzhu) సినిమాతో దర్శకురాలిగా తనదైన ముద్ర వేసిన రతీనా పీటీ (Ratheena PT) ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ పాతిరాత్రి కథ విషయానికి వస్తే.. ఎస్ఐ ఝాన్సీ (నవ్యా నాయర్), కానిస్టేబుల్ హరీష్ (సౌబిన్ షాహిర్) ఒక రోజు రాత్రి రొటీన్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా జరిగిన ఒక జర్నలిస్ట్ మరణం వారి జీవితాలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఆ మర్డర్ కేసు దర్యాప్తులో వారికి ఎదురైన సవాళ్లు, వాస్తవాలు.. అలాగే వారి సొంత వ్యక్తిగత సమస్యలు, విధి నిర్వహణ మధ్య వారు పడే మానసిక సంఘర్షణే ఈ సినిమా కథ.

ఈ సినిమాలో సన్నీ వేన్, ఆన్ అగస్టిన్, శబరీష్ వర్మ, ఇంద్రన్స్, ఆత్మియా రాజన్, హరిశ్రీ అశోకన్, అచ్యుత్ కుమార్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

గతేడాది అక్టోబర్‌లో ‘ది పెట్ డిటెక్టివ్’, 'థియేటర్' సినిమాలతో పాటు థియేటర్లలోకి వచ్చిన ఈ 'పాతిరాత్రి' సినిమాను.. వాస్తవికతకు దగ్గరగా ఉండే థ్రిల్లర్స్ ఇష్టపడేవారు కచ్చితంగా ఈ వీకెండ్‌లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More