ఓటీటీలోకి పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ సీజన్ 2.. సీక్రెట్ ఎఫైర్స్.. లిప్ కిస్, న్యూడ్ సీన్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీలోకి పాపులర్ రొమాటింక్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఈ ఎరోటిక్ సిరీస్ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లిప్ కిస్, న్యూడ్ సీన్స్, సీక్రెట్ ఎఫైర్స్ తో ఉండే సిరీస్ పెద్దవాళ్లకు మాత్రమే. ఈ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చంటే? 

Published on: Oct 14, 2025, 08:22:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి పాపులర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘మ్యాక్స్‌టాన్ హాల్’ సీజన్ 2 వచ్చేస్తోంది. ఫస్ట్ సీజన్ మ్యాక్స్‌టాన్ హాల్-ది వరల్డ్ బిట్వీన్ అస్ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజైన ఫస్ట్ వీక్ లో ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో నంబర్ వన్ గా ట్రెండ్ అయింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సిరీస్ లో సీజన్ 2 రాబోతోంది.

ఓటీటీలోకి రొమాంటిక్ సిరీస్ సీజన్ 2 (x/PrimeVideoIN)
ఓటీటీలోకి రొమాంటిక్ సిరీస్ సీజన్ 2 (x/PrimeVideoIN)

మ్యాక్స్‌టాన్ హాల్ ఓటీటీ

పాపులర్ వెబ్ సిరీస్ మ్యాక్స్‌టాన్ హాల్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఓటీటీలోకి ఇది అడుగుపెట్టబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ అయిన మ్యాక్స్‌టాన్ హాల్ సీజన్ 2 కు సమయం ఆసన్నమవుతోంది. ఈ సీజన్ 2 నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ జర్మన్ రొమాంటిక్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

నవల ఆధారంగా

మోనా కాస్టెన్ రచించిన బెస్ట్ సెల్లర్ నవల ‘సేవ్ మీ’ ఆధారంగా మ్యాక్స్‌టాన్ హాల్ ఫస్ట్ సీజన్ తెరకెక్కింది. ఇప్పుడు కూడా ఆ పాపులర్ నవల ఆధారంగా రెండో సీజన్ ను రెడీ చేశారు మేకర్స్. దీనికి మార్టిన్ షెరియర్, టెరిక్ డైరెక్టర్లు. ఫస్ట్ సీజన్ 2024, మే 9న ప్రీమియర్ అయింది. తొలి సీజన్ లో ఆరు ఎపిసోడ్లున్నాయి. సెకండ్ సీజన్ 2025, నవంబర్ 7న ఓటీటీలోకి రాబోతుంది. ఇందులోనూ 6 ఎపిసోడ్లు ఉంటాయి.

మ్యాక్స్‌టాన్ హాల్ వెబ్ సిరీస్ లో హారియట్ హెర్బిగ్, డామియన్, సొంజా, బెన్, ఫెజా తదితరులు నటించారు.

మ్యాక్స్‌టాన్ హాల్ కథ

రుబీ బెల్ అనే యువతి మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీలోకి స్కాలర్ షిప్ తో ఎంటర్ అవుతుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు రిఫరల్ లెటర్ కోసం ట్రై చేస్తుంది. అదే సమయంలో మ్యాక్స్‌టాన్ హాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుటన్ తో స్టూడెంట్ లిడియా ఎఫైర్ పెట్టుకుంటుంది. వాళ్లు రొమాన్స్ చేస్తుండగా రుబీ చూస్తుంది.

సుటన్ తో తన ఎఫైర్ గురించి రుబీ ఎవరికీ చెప్పకుండా బెదిరించాలని తన సోదరుడు జేమ్స్ కు చెప్తుంది లిడియా. జేమ్స్ డబ్బులు ఇవ్వాలని చూసినా, బెదిరించినా రుబీ వినదు. ఆ క్రమంలో రుబీ, జేమ్స్ మధ్య లవ్ పుడుతుంది. ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. సెక్స్ లోనూ పాల్గొంటారు. కానీ తన కొడుకుతో రుబీ రొమాన్స్ చేస్తుండగా చూసిన జేమ్స్ తండ్రి కోప్పడతాడు. జేమ్స్ ను అక్కడి నుంచి పంపించేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రుబి ఆక్స్ ఫర్డ్ కు వెళ్లిందా? జేమ్స్, రుబీ కలిశారా? అన్నది రెండో సీజన్ లో చూపించనున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More