Maya Lady Trailer: యువ హీరో రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మాయ లేడీ’. గురువారం (నవంబర్ 5) వైభవంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

లవ్, రొమాన్స్, కవల అక్కాచెల్లెళ్ల గందరగోళం, కమెడియన్ సత్య మార్క్ హ్యూమర్‌తో కూడిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రసన్నకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కరాటే కోచ్ లవ్ స్టోరీ.. ఊహించని ట్విన్స్ ట్విస్ట్
‘మాయ లేడీ’ స్టోరీ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఇందులో లీడ్ రోల్ క్రిష్ (రాకేష్ వర్రే) ఒక నిబద్ధత కలిగిన కరాటే కోచ్. పెళ్లి చేసుకోవడానికి సరైన అమ్మాయి కోసం వెతుకుతున్న క్రిష్‌కి ఆశ (మధుమిత సర్కార్) పరిచయం అవుతుంది. ఆమె క్యూట్ బిహేవియర్, ఎనర్జీ, వైబ్‌కి ఫిదా అయిపోయి ఆమెతో ప్రేమలో పడతాడు.
అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆమె కవల సోదరి రూపా ఎంట్రీ ఇస్తుంది. ఆశా, రూపా ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, ప్రవర్తనలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఈ ట్విన్ సిస్టర్స్ మధ్య చిక్కుకున్న క్రిష్ పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారుతుంది. చివరికి క్రిష్ ఈ విచిత్ర సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనే సస్పెన్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ కట్‌ను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
కమెడియన్ సత్య పంచ్‌లు..
ఈ మాయ లేడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా కమెడియన్ సత్య కామెడీ నిలవనుంది. ట్రైలర్లో సత్య టైమింగ్, ఆయన పేల్చిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. హీరోగా నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించిన రాకేష్ వర్రే.. ప్రేమలోని ఉత్సాహాన్ని, కవలల ట్విస్ట్ వల్ల వచ్చే అయోమయాన్ని తన నటనతో చక్కగా పండించారు.
{{/usCountry}}ఈ మాయ లేడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా కమెడియన్ సత్య కామెడీ నిలవనుంది. ట్రైలర్లో సత్య టైమింగ్, ఆయన పేల్చిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. హీరోగా నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించిన రాకేష్ వర్రే.. ప్రేమలోని ఉత్సాహాన్ని, కవలల ట్విస్ట్ వల్ల వచ్చే అయోమయాన్ని తన నటనతో చక్కగా పండించారు.
{{/usCountry}}మధుమిత సర్కార్ అటు ఆశా, ఇటు రూపా అనే రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో వైవిధ్యమైన నటనను కనబరిచారు. వీరితో పాటు అనుభవజ్ఞులైన నటి ఇంద్రజ, మైసూర్ సురేష్, ఇతర నటీనటులు కీలక పాత్రలలో మెరిశారు.
‘మాయా లేడీ’ ట్రైలర్ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం అండ్ పాటలు కథలోని ఎమోషన్‌కి, కామెడీకి సరైన న్యాయం చేశాయి. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించగా, వి.డి. జగన్ మోహన్ రావు సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ‘మాయ లేడీ’.. ఈ వినోదాత్మక ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. నవంబర్ 13న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.