నాగచైతన్యతో మీనాక్షి అడ్వెంచర్.. ఎన్‌సీ 24 ఫస్ట్ లుక్ రిలీజ్.. దక్షగా ఎంటర్‌టైన్ చేయనున్న బ్యూటీ
వరుసగా క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరీ అడ్వెంచరస్ మైథాలజీ మూవీ నాగ చైతన్యతో నటిస్తోంది. ఈ మూవీ నుంచి మీనాక్షి ఫస్ట్ లుక్ ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నాగ చైతన్య మరో భారీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. కార్తీక్ దండు డైరెక్షన్ లో అడ్వెంచర్ మైథాలిజీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్యతో కలిసి మీనాక్షి చౌదరి అడ్వెంచర్ చేయబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో మీనాక్షి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది.

మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్
నాగ చైతన్య- మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఎన్‌సీ 24 (వర్కింగ్ టైటిల్) నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లుక్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో మీనాక్షి పురావస్తు శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి మెరవబోతోంది. దక్ష అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది.
చీకటి గుహలో
ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు మీనాక్షి చౌదరి లుక్ చూస్తే అర్థమవుతోంది. ఒక చీకటి గుహలో చేతిలో ఏదో పట్టుకుని పరీక్షిస్తోంది మీనాక్షి. ఏదో రహస్యాన్ని కనిపెట్టేందుకు ఆమె సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. సినిమాకు ఈ లుక్ మిస్టరీ టచ్ ఇస్తున్నట్లే కనిపిస్తోంది.
విరూపక్షతో హిట్
సాయి దుర్గా తేజ్ హీరోగా నటించిన విరూపక్షతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కార్తీక్ దండు. ఆ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య మూవీతోనూ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కార్తీక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పిస్తున్నారు. అజనీష్ బి. లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. లపాతా లేడీస్ తో పాపులర్ అయిన స్పార్ష్ శ్రీవాస్తవ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
డిఫరెంట్ రోల్
వరుసగా అదిరిపోయే సినిమాలతో సాగిపోతోంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ కంప్లీట్ చేస్తోంది. ఇప్పుడు ఎన్‌సీ 24లో నాగ చైతన్య సరసన డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది మీనాక్షి చౌదరి. ఈ మూవీతో ఆమె కెరీర్ మరో స్థాయికి చేరే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


