Tamil OTT: ఏకంగా నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్లలో హీరో-ఇవాళే ఓటీటీలోకి తెలుగులో తమిళ సూపర్ హిట్ మూవీ-ఎందుకు నచ్చుతుందంటే?
Tamil OTT: ఇవాళ ఓటీటీలోకి మరో తమిజా సూపర్ హిట్ మూవీ వచ్చేస్తోంది. హిప్హాప్ తమిళ ఆది హీరోగా నటించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించిన ‘మీసయ మురుక్కు 2’ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఇందులో హీరో ఏకంగా నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేశాడు.
Tamil OTT: తమిళ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హిప్హాప్ తమిజా ఆది. కుర్రకారును ఉర్రూతలూగించే సంగీతంతో పాటు, యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలతో సినిమాలు తీయడం ఆయన స్టైల్. అలా 2017లో వచ్చి భారీ విజయం సాధించిన 'మీసయ మురుక్కు' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన తాజా చిత్రమే 'మీసయ మురుక్కు 2'.

మీసయ మురుక్కు 2 ఓటీటీ
మీసయ మురుక్కు 2 మూవీ సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. మీసయ మురుక్కు 2 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) సొంతం చేసుకుంది.
ఇవాళ (నవంబర్ 5) సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హాయిగా చూసేయొచ్చు.
సింగర్ కలల ప్రయాణం
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన మ్యూజిక్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కలలుకనే ఒక యువ సింగర్ ప్రయాణమే ఈ చిత్రం. స్వతంత్ర సంగీత దర్శకులు ఇండస్ట్రీలో ఎదుర్కొనే సవాళ్లు, కుటుంబ బంధాలు, వ్యక్తిగత పోరాటాలు.. ఇలా అన్నీ అంశాలను ఇందులో చాలా చక్కగా చూపించారు. విశేషం ఏంటంటే, ఈ సినిమాలో హిప్హాప్ తమిజా ఆది ఏకంగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించాడు.
ఫ్యామిలీతో చూసేలా
ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేలా ఆది ఈ చిత్రాన్ని ఆది మలిచాడు. ఈ మూవీ 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా తమిళనాడులో యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఖుష్బూ సుందర్‌కు చెందిన అవ్ని మూవీస్, ఏసీఎస్ అరుణ్ కుమార్ బెన్జ్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాలోని పాటలు, మ్యూజిక్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
ఎందుకు నచ్చుతుందంటే?
మ్యూజికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్లో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడం ఖాయం. సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 'మీసయ మురుక్కు 2' చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఆది మ్యూజిక్, ఎనర్జీని, ఫ్యామిలీ, యూత్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పక్కాగా నచ్చుతుందని టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


