...
...
Next Story

Mega 158: మెగా 158 ఫస్టాఫ్ లాక్.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్.. సంక్రాంతికి రెడీ అవుతున్న చిరంజీవి, బాబీ మూవీ

Mega 158: చిరంజీవి నెక్ట్స్ మూవీ మెగా 158 నుంచి తాజాగా వస్తున్న అప్డేట్ మెగా అభిమానులను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ మూవీ ఫస్టాఫ్ ఎడిట్ అయిపోయిందని, ఇక చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఓ స్పెషల్ అప్డేట్ రానుందని బజ్ నెలకొంది.

Published on: Aug 18, 2026, 16:51:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'Mega158' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 40 రోజుల సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిట్ దాదాపు లాక్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

బాబీ మార్క్ మాస్ ఎలివేషన్స్.. ఇంటర్వెల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్

Mega 158: మెగా 158 ఫస్టాఫ్ లాక్.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్.. సంక్రాంతికి రెడీ అవుతున్న చిరంజీవి, బాబీ మూవీ
Mega 158: మెగా 158 ఫస్టాఫ్ లాక్.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్.. సంక్రాంతికి రెడీ అవుతున్న చిరంజీవి, బాబీ మూవీ

కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగాస్టార్ వింటేజ్ మాస్ స్వాగ్‌ను స్క్రీన్ మీద చూపించడంలో బాబీ రూట్ సపరేట్. ఈ సినిమాలో వస్తున్న ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ థియేటర్లలో విపరీతమైన మాస్ హై ఇస్తుందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్యలోనూ ఇంటర్వల్ బ్లాక్ మరో లెవెల్లో ఉంది.

ఇక ఇప్పుడు కూడా చాలా భారీ స్కేల్‌లో ప్లాన్ చేసిన ఈ ఇంటర్వెల్ బ్లాక్.. ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందట. చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. సీన్ల కంపోజిషన్, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా బాబీ డిజైన్ చేసిన మాస్ ఎలిమెంట్స్ పట్ల మెగాస్టార్ లీనమై పనిచేస్తున్నారు.

ఆగస్టు 22న మెగా బర్త్‌డే గిఫ్ట్.. అనౌన్స్‌మెంట్ రెడీ

ఈ సినిమాకు సంబంధించి అసలైన సర్ ప్రైజ్ ఆగస్టు 22న రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ లేదా మాస్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్ మెగా ఫ్యాన్స్ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే మెగాస్టార్‌కు పెద్ద సెంటిమెంట్. 'ఘరానా మొగుడు', 'స్నేహం కోసం', 'ఇంద్ర', 'అన్నయ్య', 'వాల్తేరు వీరయ్య' లాంటి సినిమాలు పండుగ రేసులో వచ్చి బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశాయి.

ఇప్పుడు 'మెగా 158' కూడా అదే సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి సిద్ధమవుతోంది. నాన్ స్టాప్ షూటింగ్‌తో సినిమాను వేగంగా పూర్తి చేసి, క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe