Chiranjeevi Amit Shah: చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. అమిత్ షాతో భేటీ.. డీప్ ఫేక్ కంటెంట్‌పై ఫిర్యాదు

Chiranjeevi Amit Shah: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ పేరుతో సినీ ప్రముఖుల పరువుకు భంగం కలిగిస్తూ, అసభ్యకరంగా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్న వారి ఆట కట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నేరుగా రంగంలోకి దిగారు. హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం.

Published on: Nov 2, 2026, 21:26:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Chiranjeevi Amit Shah: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీలను ఉపయోగించి సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల రూపాన్ని, గొంతును మార్ఫింగ్ చేస్తూ వికృతానందం పొందుతున్న ముఠాల సంఖ్య పెరిగిపోయింది. కేవలం సోషల్ మీడియా వేదికలకే పరిమితం కాకుండా ఏకంగా సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి, వారి ఇమేజ్‌కు భంగం కలిగిస్తున్న ఈ అంశంపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Chiranjeevi Amit Shah: చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. అమిత్ షాతో భేటీ.. డీప్ ఫేక్ కంటెంట్‌పై ఫిర్యాదు
Chiranjeevi Amit Shah: చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్.. అమిత్ షాతో భేటీ.. డీప్ ఫేక్ కంటెంట్‌పై ఫిర్యాదు

ఈ క్రమంలో ఈ డిజిటల్ క్రైమ్‌పై గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అత్యవసరంగా సమావేశమై ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు.

ఈ డిజిటల్ ముప్పుపై కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అమిత్ షాతో అత్యవసర భేటీ: 'మా పరువుతో ఆటలొద్దు!'

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా కలిశారు. ఈ సమావేశంలో ఏఐ టెక్నాలజీ ముసుగులో సినీ ప్రముఖులపై జరుగుతున్న మార్ఫింగ్ దాడిని వివరిస్తూ.. వికృత చేష్టలకు పాల్పడుతున్న మూకలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో చిరంజీవి ఏఐ మార్ఫింగ్ కంటెంట్‌పై బహిరంగంగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం పోస్టులకే పరిమితం కాకుండా నేరుగా కేంద్ర హోంమంత్రితోనే మాట్లాడి, ఆర్టిస్టుల ప్రాథమిక హక్కులను కాపాడాలని, క్రియేటివ్ రంగానికి రక్షణగా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన ప్రతిపాదించారు.

అమిత్ షా సానుకూల స్పందన.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళనను, వారు అందించిన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా శ్రద్ధగా విన్నారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న సమస్యల తీవ్రతను అంగీకరించిన హోంమంత్రి.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో, అత్యవసరంగా విచారిస్తుందని భరోసా ఇచ్చారు.

డీప్‌ఫేక్ ఆధారిత సైబర్ నేరాలకు పాల్పడేవారిపై కఠినమైన చర్యలు, జరిమానాలు విధించేలా చట్టపరమైన మార్గదర్శకాలను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ అంశంపై పూర్తిస్థాయి లిఖితపూర్వక విజ్ఞప్తిని సమర్పించాలని చిరంజీవిని కోరారు. దీనికి సంబంధించిన సమన్వయ బాధ్యతలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు.

ఊరటనిచ్చిన కేంద్రం భరోసా: హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే స్పందించి, ఒక కేంద్ర మంత్రికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలోని కళాకారులు, సాంకేతిక నిపుణుల భద్రత పట్ల కేంద్రం చూపిన చొరవకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏఐ, డీప్‌ఫేక్ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలు మొత్తం భారతీయ సినీ రంగానికి కొండంత అభయాన్ని ఇస్తాయని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More