Mega Box Office Records: ఒకే ఏడాది తండ్రీకొడుకుల ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, రామ్ చరణ్ హిస్టారిక్ ఫీట్
Mega Box Office Records: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో స్టార్ ఫ్యామిలీలు ఉన్నప్పటికీ 2026లో 'మెగా ఫ్యామిలీ' సృష్టించిన రికార్డు మాత్రం అసాధారణమైనది. చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీకొడుకుల జోడీ ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 2 ఇండస్ట్రీ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
Mega Box Office Records: ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీల నుంచి మల్టిపుల్ స్టార్లు రావడం చూశాం. కానీ 2026 లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ సృష్టించిన ప్రభంజనం మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంది. ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు ఇద్దరూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా తమ సినిమాలను నిలబెట్టారు.

Chiranjeevi 300 Crores | 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల వేట
ఈ ఏడాది మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన వింటేజ్ వేటను షురూ చేశారు. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటేసి, ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
Ram Charan Beats Megastar | తండ్రి రికార్డును దాటేసిన కొడుకు..
చిరంజీవి సెట్ చేసిన ఈ భారీ రికార్డును కొన్ని నెలల గ్యాప్ లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన 'పెద్ది' (Peddi) సినిమాతో బ్రేక్ చేయడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ప్యూర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.
'పెద్ది' మూవీ ఇప్పటికే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను చాలా ఈజీగా దాటేసింది. ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతూ 2026 లోనే సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ అఫీషియల్ ఛాంపియన్ గా నిలిచింది.
డిస్ట్రిబ్యూటర్లకు ఊరట.. చరిత్రలో నిలిచిపోయే ఘనత
ఈ ఘనత కేవలం నెంబర్ల పరంగానే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. ఎందుకంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో టాప్ 1, టాప్ 2 స్థానాలను ఒకే ఇంట్లోని తండ్రీకొడుకులు ఆక్రమించడం ఇదే మొదటిసారి.
ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన సమయంలో వచ్చి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ లు అందించాయి. ముఖ్యంగా తీవ్ర నిరాశ పరిచిన సమ్మర్ సీజన్ తర్వాత.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మొఖాల్లో 'పెద్ది' సినిమా భారీ లాభాలతో నవ్వులు పూయించింది. మొత్తానికి 2026 సంవత్సరాన్ని మెగా ఫ్యామిలీ తమ బాక్సాఫీస్ అరాచకంతో ఒక మెమొరబుల్ ఇయర్ గా మార్చేసింది. ఈ రికార్డ్ రాబోయే రోజుల్లో బ్రేక్ చేయడం ఎవరికైనా చాలా కష్టమనే చెప్పాలి.
హెచ్‌టీ విశ్లేషణ
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ ను ఏలుతుండగా, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో తన సత్తా చాటుతున్నాడు. కానీ ఒకే ఏడాదిలో ఇద్దరూ రూ. 300 కోట్లు, రూ. 400 కోట్ల రేంజ్ లో మార్కెట్ ను పెంచుకోవడం టాలీవుడ్ స్టామినాను చూపిస్తోంది. బుచ్చిబాబు సానా 'ఉప్పెన' తర్వాత రామ్ చరణ్ ఇంటెన్సిటీని వాడుకుని ‘పెద్ది’తో కొట్టిన దెబ్బకు నార్త్ బెల్ట్ లో కూడా వసూళ్లు కురుస్తున్నాయి.
People Also Ask (FAQs)
2026 లో రామ్ చరణ్ నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది?
డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర రూ. 400 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతూ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా కలెక్షన్స్ ఎంత సాధించాయి?
చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.
ఈ ఏడాది మెగా ఫ్యామిలీ సృష్టించిన అరుదైన రికార్డు ఏంటి?
భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఒకే సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాల్లో టాప్ 1, టాప్ 2 స్థానాలను తండ్రీకొడుకులైన రామ్ చరణ్, చిరంజీవి సొంతం చేసుకున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


