Peddi Box Office Collection: 10 రోజులు, ఇండియాలో 245 కోట్లు- మరి రామ్ చరణ్ పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Peddi Box Office Collection Day 10: రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో శనివారం నాటికి రూ. 245 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది.
Peddi 10 Days Worldwide Box Office Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.

3 వేల స్క్రీన్లు
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదలైన పెద్ది సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రారంభంలో మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
82 లక్షల టికెట్లు
ఫలితంగా పెద్ది చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 20 కోట్ల వసూళ్లను రాబట్టి, ఏకంగా 82 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్‌కు అద్దం పడుతోంది. మొదటి రోజే దేశీయంగా రూ. 40.66 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం వీక్‌డేస్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, వీకెండ్ వచ్చేసరికి మళ్లీ పుంజుకుంది.
రెండో వీకెండ్‌లో పెద్ది కలెక్షన్ల జోరు
మొదటి సోమవారం (జూన్ 8) నాడు రూ. 12.35 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఆ తర్వాత రోజుల్లో కొద్దిగా మందగించింది. అయితే, రెండో వీకెండ్ ప్రారంభం కాగానే బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపు అందుకుంది. గురువారం (జూన్ 11) రూ. 6.30 కోట్లు, శుక్రవారం (జూన్ 12) రూ. 5.15 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో శనివారం (10వ రోజు-జూన్ 13) ఏకంగా రూ. 7.86 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది.
పెద్ది ఇండియన్ కలెక్షన్స్
దీంతో ఇప్పటివరకు భారతదేశంలో పెద్ది పది రోజుల గ్రాస్ కలెక్షన్లు రూ. 245.25 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, 10 రోజుల ఇండియా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 206.56 కోట్లు దాటేసింది పెద్ది మూవీ. ఈ భారీ వసూళ్లతో కోలీవుడ్ హిట్ చిత్రం 'కరుప్పు' రికార్డులను తిరగరాసి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా 'పెద్ది' అవతరించింది.
పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
అలాగే, వరల్డ్ వైడ్‌గా 10 రోజుల్లో పెద్ది సినిమాకు రూ. 366 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఒకవైపు కమర్షియల్‌గా సక్సెస్ సాధిస్తున్నప్పటికీ, మరోవైపు వివాదాల్లోనూ నిలిచింది.
సీన్లను తొలగిస్తున్నట్లుగా ప్రకటన
పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సాన చాలా పరిణతితో స్పందించారు. వివాదాస్పదమైన, ఇబ్బందికరంగా ఉన్న కొన్ని సీన్లను థియేటర్ల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


