Sudha Reddy Met Gala: మెట్ గాలాలో మెరిసిన మేఘా సుధారెడ్డి.. ఈ ఫ్యాషన్ ఐకాన్ ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే షాక్ అవాల్సిందే
Sudha Reddy Met Gala: ప్రపంచ ఫ్యాషన్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే మెట్ గాలా 2026 ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందులో హైదరాబాద్ మహిళ మేఘా సుధా రెడ్డి మెరిసింది. ఈ ఈవెంట్ కోసం ఆమె ధరించిన నెక్లెస్ రేట్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
Sudha Reddy Met Gala: సినీ తారల తళుకుల నుంచి ఫ్యాషన్ ప్రియుల మెరుపుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే మెట్ గాలా 2026 ఈవెంట్ గా గ్రాండ్ గా జరిగింది. సోమవారం (మే 4) న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ ఈవెంట్ లో హైదరాబాద్ మహిళా మేఘా సుధా రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మెట్ గాలాలో సుధా రెడ్డి
బిజినెస్ విమెన్, ఎంట్రప్రెన్యూర్, ఫ్యాషన్ ఐకాన్ అయిన మేఘా సుధా రెడ్డి మెట్ గాలా 2026 ఈవెంట్లో మెరిసింది. రెడ్ కార్పెట్ పై అదరగొట్టింది. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గౌన్ లో సుధా రెడ్డి స్పెషల్ గా కనిపించింది.
ఆ నెక్లెస్ ధర
మెట్ గాలా 2026 ఈవెంట్లో సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ వైరల్ గా మారింది. సుమారు 15 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 142 కోట్లు) విలువైన ఈ చారిత్రక నెక్లెస్‌ను ధరించి ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వేడుకలో సుధారెడ్డి ధరించిన దుస్తులు, నగలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.
స్టైలిష్ట్ ఏం చెప్పిందంటే?
ఈ ఏడాది ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ అనే థీమ్‌తో జరిగిన మెట్ గాలా వేడుకలో సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ ఆమె వ్యక్తిగత కలెక్షన్‌కు లోనిదేనని ప్రసిద్ధ సెలబ్రిటీ స్టైలిస్ట్ మారిల్ హేన్ పీపుల్.కామ్ కు తెలిపింది. ఈ నెక్లెస్‌లో విక్టోరియన్ తరహా ఫినిషింగ్‌తో కూడిన చైన్ ఉంది. ఇందులో పెద్ద త్రిభుజాకార, పియర్ ఆకారపు రోజ్-కట్ డైమండ్స్‌ను ప్రత్యేకంగా అమర్చారు.
క్వీన్ ఆఫ్ మెరెలానీ
సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ కు ప్రధాన ఆకర్షణగా ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ నిలిచింది. ఇది టాంజానియాలోని మెరెలానీ హిల్స్ నుంచి సేకరించిన 550 క్యారెట్ల అరుదైన డీప్ వయోలెట్-బ్లూ రంగు టాంజానిట్ పెండెంట్.
వీటితో పాటు సుధారెడ్డి 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన డైమండ్ హాల్లో 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్, 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ ఉంగరాన్ని కూడా ధరించింది. ఈ ఆభరణాలు ఆమె రూపానికి మరింత వన్నె తెచ్చాయి.
ది ట్రీ ఆఫ్ లైఫ్
సుధా రెడ్డి ధరించిన దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో రూపొందించిన ఈ డిజైన్ దక్షిణ భారతదేశానికి చెందిన కలంకారీ కళా రూపం నుంచి ప్రేరణ పొందింది. ఈ దుస్తులను తయారు చేయడానికి 90 మందికి పైగా కళాకారులు 3, 459 గంటలకు పైగా శ్రమించారు.
ఈ దుస్తులపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడు పువ్వు, అలాగే సూర్యచంద్రుల ప్రతీకలను జతచేశారు. వెల్వెట్, సిల్క్, ట్యూలే వంటి వస్త్రాలపై బంగారు జరీ, జర్దోజీ పనులతో ఈ డిజైన్‌ను అత్యంత అద్భుతంగా రూపొందించారు.
సుధారెడ్డి కామెంట్
"హైదరాబాదే నా మూలం. ఈ దుస్తులు మన సాంస్కృతిక గుర్తింపును ప్రపంచానికి చాటిచెప్పేలా ఉన్నాయి" అని సుధా రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకుంది భారతీయ హస్తకళలు కేవలం చరిత్రకే పరిమితం కాకుండా, సజీవమైన కళా రూపాలుగా వెలుగొందాలని ఆమె స్పష్టం చేసింది. మన సంప్రదాయ పద్ధతులు గ్లోబల్ ఫ్యాషన్ వేదికలపై సత్తా చాటగలవని నిరూపించడమే తన లక్ష్యమని తెలిపింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


