Michael: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 'మైఖేల్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ హాలీవుడ్ బయోపిక్.. సినిమా హిస్టరీలోనే ఏకంగా 1 బిలియన్ డాలర్స్ (సుమారు రూ.9500 కోట్లు) క్రాస్ చేసిన ఫస్ట్ బయోపిక్‌గా గ్లోబల్ రికార్డ్ సెట్ చేసింది.

యాక్షన్ డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా అద్భుతమైన విజన్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. మొదటి రోజు నుంచే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఏప్రిల్ 2026లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మొదట్లో క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్నా, ఆడియన్స్‌కు మాత్రం విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.
ఓపెన్‌హైమర్ రికార్డులు బ్రేక్
ఇప్పటివరకు బయోపిక్స్ హిస్టరీలో 2018లో వచ్చిన 'బోహేమియన్ రాప్సోడీ' 911 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉండేది. అలాగే ఒక రియల్ లైఫ్ పర్సన్ మీద వచ్చిన మూవీస్ కేటగిరీలో అద్భుతమైన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఓపెన్‌హైమర్' (975 మిలియన్ డాలర్స్)దే రికార్డ్. కానీ ఇప్పుడు ఆ రెండు బడా సినిమాల బాక్సాఫీస్ లెక్కలను 'మైఖేల్' మూవీ ఈజీగా తుడిచిపెట్టేసింది.
అమెరికా డొమెస్టిక్ మార్కెట్‌లో 372 మిలియన్ డాలర్స్, ఓవర్సీస్ మార్కెట్‌లో 629 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఈ కల్ట్ క్లాసిక్ ఏకంగా వంద కోట్ల డాలర్ల మార్క్ అందుకుంది. లయన్స్ గేట్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పెద్ద ఎసెట్. వాళ్ల బ్యానర్‌లో గతంలో వచ్చిన 'ద హంగర్ గేమ్స్', 'ట్విలైట్' ఫ్రాంచైజీల రికార్డులను కూడా ఈ సినిమా సులువుగా క్రాస్ చేసి నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది.
ఆకట్టుకున్న జాఫర్ జాక్సన్ డెబ్యూ
ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ప్రాణం పోసింది మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్. యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే ఫస్ట్ మూవీ అయినా.. స్క్రీన్ మీద ఏమాత్రం తడబడకుండా, అచ్చం తన అంకుల్ మైఖేల్‌ను దించేస్తూ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో కోల్మన్ డొమింగో.. తండ్రి జో జాక్సన్‌గా పవర్‌ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టారు. తల్లి కేథరీన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ నటించగా, మైల్స్ టెల్లర్, లారా హ్యారియర్ లాంటి హాలీవుడ్ టాప్ కాస్ట్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.
{{/usCountry}}ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ప్రాణం పోసింది మైఖేల్ జాక్సన్ సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్. యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే ఫస్ట్ మూవీ అయినా.. స్క్రీన్ మీద ఏమాత్రం తడబడకుండా, అచ్చం తన అంకుల్ మైఖేల్‌ను దించేస్తూ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో కోల్మన్ డొమింగో.. తండ్రి జో జాక్సన్‌గా పవర్‌ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టారు. తల్లి కేథరీన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ నటించగా, మైల్స్ టెల్లర్, లారా హ్యారియర్ లాంటి హాలీవుడ్ టాప్ కాస్ట్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.
{{/usCountry}}ముఖ్యంగా జాక్సన్ 5 బ్యాండ్ రోజులతో మొదలై, 1988 నాటి వరల్డ్ ఫేమస్ 'బ్యాడ్' టూర్ నాటికి ఆయన సోలో కెరీర్ ఎలా పీక్స్‌కు వెళ్లిందనే జర్నీని డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా కళ్లకు కట్టినట్లు చూపించారు. దానికి జాన్ లోగన్ అందించిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్ యాడ్ అవ్వడంతో థియేటర్లలో మ్యాజిక్ వర్కౌట్ అయింది.
లీగల్ ఇష్యూస్ దాటుకుని గ్రాండ్ సక్సెస్
నిజానికి రిలీజ్‌కు ముందే స్క్రిప్ట్ విషయంలో కొన్ని లీగల్ ఇష్యూస్ రావడం, ఏకంగా కొన్ని వారాల పాటు సినిమాను రీషూట్ చేయడంతో ప్రొడక్షన్ టీమ్ బాగా టెన్షన్ పడింది. పైగా జాక్సన్ లైఫ్‌లో చివరి రోజుల్లో ఉన్న వివాదాలను టచ్ చేయకుండానే కథను ముగించడంపై క్రిటిక్స్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ జాక్సన్ ఫ్యాన్ బేస్ ముందు ఆ నెగిటివిటీ ఏమాత్రం పనిచేయలేదు.
స్ట్రాంగ్ మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ భారీ సెన్సేషనల్ సక్సెస్‌తో మైఖేల్ జాక్సన్ లైఫ్‌కి సంబంధించి ఇంకో సినిమాను లైన్‌లో పెట్టాలని లయన్స్‌గేట్ స్టూడియోస్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని హాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొత్తానికి హాలీవుడ్ హిస్టరీలో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోవడం ఖాయం.