Mirzapur The Movie: రూ.1160 వేస్ట్, 15 నిమిషాలు నిద్రపోయా.. 197 కోట్లు కొల్లగొట్టిన క్రైమ్ థ్రిల్లర్‌పై ఫైర్ అయిన రైటర్

Mirzapur The Movie: మీర్జాపూర్ ది మూవీపై ప్రముఖ రైటర్ శోభా డే ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదని, తాను 15 నిమిషాలు పడుకున్నానని అనడం గమనార్హం.

Published on: Sep 10, 2026, 20:55:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mirzapur The Movie: బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.197 కోట్ల గ్రాస్ రాబట్టి థియేటర్లలో రచ్చ లేపుతున్న ‘మీర్జాపూర్: ది మూవీ’పై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా అసలు తీయాల్సింది కాదని, థియేటర్‌లో తాను 15 నిమిషాల పాటు నిద్రపోయానని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చెప్పి షాక్ ఇచ్చారు.

Mirzapur The Movie: రూ.1160 వేస్ట్, 15 నిమిషాలు నిద్రపోయా.. 197 కోట్లు కొల్లగొట్టిన క్రైమ్ థ్రిల్లర్‌పై ఫైర్ అయిన రైటర్
Mirzapur The Movie: రూ.1160 వేస్ట్, 15 నిమిషాలు నిద్రపోయా.. 197 కోట్లు కొల్లగొట్టిన క్రైమ్ థ్రిల్లర్‌పై ఫైర్ అయిన రైటర్

రూ.900 టికెట్, రూ.260 భేల్ దండగ.. సోషల్ మీడియాలో సెన్సేషన్

సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మీర్జాపూర్: ది మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన శోభా డే.. అక్కడ అరాచకమైన సీన్లు చూసి అసహనం వ్యక్తం చేశారు. టికెట్ కోసం రూ.900, భేల్ కోసం రూ.260 ఖర్చు చేసి 4 గంటల సమయం వేస్ట్ చేసుకున్నానని ఆవేదన చెందారు.

"ఈ మూవీ అసలు మైండ్ లేకుండా తీశారు. అసలు కథే లేదు, ఎక్కడికి పోతోందో అర్థం కాలేదు. నా వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఏకంగా గురకపెట్టి నిద్రపోయారు" అని శోభా డే తన రివ్యూలో ఎద్దేవా చేశారు.

పంకజ్ త్రిపాఠి రొటీన్.. రవికిషన్, అలీ ఫజల్ కేక

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2018 నుంచి ట్రెండ్ అవుతున్న 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ కు ఇది ఫిల్మ్ అడాప్టేషన్. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేశారు. ప్రైమ్ సిరీస్‌లోని క్యారెక్టర్లనే బిగ్ స్క్రీన్ పైకి తెచ్చారు.

నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ కాలిన్ భయ్యాగా నటించిన పంకజ్ త్రిపాఠిపై శోభా డే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్లతో విసుగు తెప్పించారని చెప్పారు. అయితే గుడ్డూ పండిత్‌గా అలీ ఫజల్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్, అలాగే రవి కిషన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

'లేడీ మెక్‌బెత్' డోస్‌లో బోల్డ్ సీన్స్.. అనవసరమైన వైలెన్స్

ఈ సినిమాలో రసికా దుగల్, పంకజ్ త్రిపాఠి మధ్య వచ్చిన ఒక బోల్డ్ రొమాంటిక్ సీన్ పెద్ద సర్‌ప్రైజ్ అని శోభా డే వ్యాఖ్యానించారు. రసికా దుగల్ 'లేడీ మెక్‌బెత్' తరహా స్టెప్‌మదర్ రోల్‌లో కనిపించిందని, క్యారెక్టర్ డిజైన్ విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.

సినిమాలో ఊసరవెల్లి కథలు, పొట్టేళ్ల పాలు, విలన్ బ్రాసియర్లు కుట్టే విచిత్ర సన్నివేశాలు, తలలేని కోడి పరిగెత్తే సీన్లు ఉద్దేశపూర్వకంగా ఇరికించారని శోభా డే సెటైర్లు వేశారు. ఈ తరహా విపరీతమైన వైలెన్స్ కేవలం మగవాళ్లకు మాత్రమే నచ్చుతుందేమో గానీ తనకైతే అస్సలు నచ్చలేదని స్పష్టం చేశారు.

థియేటర్లలో కలెక్షన్ల వర్షం.. మిశ్రమ స్పందన

శోభా డే వంటి విమర్శకులు పెదవి విరిచినప్పటికీ, మాస్ ఆడియన్స్ మాత్రం 'మీర్జాపూర్ ది మూవీ'కి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.197 కోట్లు వసూలు చేయడం విశేషం.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓటీటీ కల్ట్ వెబ్ సిరీస్‌లను బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కొత్త ట్రెండ్‌గా మారింది. ఈ సినిమాలో పునీత్ కృష్ణ రాసిన డైలాగ్స్, గుర్మీత్ సింగ్ టేకింగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More