వారణాసి మూవీలో ఆరు పాటలు ఉంటాయి.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.. ఇంట్రెస్టింగ్ వివరాలు షేర్ చేసిన కీరవాణి
వారణాసి మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్రెస్టింగ్ వివరాలు షేర్ చేశాడు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో పాల్గొన్న అతడు.. మూవీలో ఆరు పాటలు ఉంటాయని చెప్పాడు.
ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ‘వారణాసి’పై అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో.. రాజమౌళి ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశాడు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సౌండ్‌ట్రాక్ గురించి కీరవాణి మాట్లాడుతూ.. అభిమానులు ఈ సినిమాలో గొప్ప మ్యూజిక్ ఆశించవచ్చని అన్నాడు.

కీరవాణి ఏమన్నాడంటే?
ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరైన కీరవాణి.. పీటీఐతో మాట్లాడాడు. "అభిమానులు అద్భుతమైన గొప్పదనాన్ని ఆశించవచ్చు. అంతకు మించి నేను ఏమీ చెప్పకూడదు. వారణాసి సినిమాలో ఆరు పాటలు ఉంటాయి" అని కీరవాణి తెలిపాడు.
కీరవాణి ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ.. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. "మీరు చేసే ఏ పనిలోనైనా అది సినిమా ప్రాజెక్ట్ కావచ్చు లేక ఇంకేదైనా కావచ్చు.. స్పష్టత, నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు. గందరగోళం ఉన్నప్పుడే ఒత్తిడి వస్తుంది. నా విషయంలో ఎలాంటి గందరగోళం లేదు" అని కీరవాణి స్పష్టం చేశాడు.
కీరవాణి.. రాజమౌళితో కలిసి గతంలో స్టూడెంట్ నం. 1, మగధీర, ఈగ, బాహుబలి వంటి విజయవంతమైన సినిమాలకు పని చేశాడు. అంతేకాదు 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని నాటు నాటు పాటకు కీరవాణి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.
'వారణాసి' మూవీ గురించి..
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు వెళ్లే ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ఒక ఉల్క భూమిపై పడుతున్నట్లు చూపించారు. ఆ శిథిలాలు వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా ఇంకా ఇతర ప్రాంతాల్లో పడతాయి. ఈ సినిమా కొన్ని శతాబ్దాల టైమ్ ట్రావెల్ కుతోడు రామాయణంతోనూ లింకు ఉన్నట్లు చూపిస్తోంది. ఇక ఈ వీడియో చివర్లో మహేష్ బాబు ఎంట్రీ, చేతిలో త్రిశూలంతో, రక్తం నిండిన ముఖంతో, ఓ ఎద్దుపై స్వారీ చేస్తూ రావడం హైలైట్ గా నిలిచింది.
మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషిస్తున్నాడు. ఇక ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీయడంతో, రాజమౌళి ఎక్స్ లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో సమస్యలతోపాటు ఈవెంట్ లో దేవుడి విషయంలో తాను చేసిన కామెంట్స్ విషయంలోనూ రాజమౌళి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ రెండు వివాదాలపై ఇప్పటి వరకూ అతడు స్పందించలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


