Modern Missamma Title Song: పెళ్లి వద్దంటున్న ‘మోడ్రన్ మిస్సమ్మ’.. ఇల్లు కట్టి చూడు సినిమా తీసి చూడు అంటూ కామెంట్స్
Modern Missamma Title Song: మోడ్రన్ మిస్సమ్మ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. అమ్మాయిలకు పెళ్లి వద్దంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా సాగింది. గోపీసుందర్ ఇచ్చిన మ్యూజిక్ ఈ పాటను ఇన్‌స్టాంట్ హిట్ చేసింది.
Modern Missamma Title Song: లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగే ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’.. అమ్మాయిలకు కనెక్ట్ అయ్యే హుక్ స్టెప్
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ ఈ సాంగ్ విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తే, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.
‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున ‘వద్దురా సోదరా’ పాట మగవాళ్లకు ఎంతలా కనెక్ట్ అయిందో, ఈ పాట అమ్మాయిలకు అంతలా రీచ్ అవుతుందని హీరోయిన్ తన్మయి ధీమా వ్యక్తం చేసింది. పెళ్లి వద్దంటూ సరదాగా సాగే ఈ సాంగ్ లోకల్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ప్రొడ్యూసర్ కిశోర్ నాయుడు బిగ్ కాంప్లిమెంట్
ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన ‘వదలా’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమా ప్రీమియర్ షో నేను ఇప్పటికే చూశాను. సాధారణంగా నేను సినిమాలో పొరపాట్లు మాత్రమే వెతుకుతాను. కానీ ఇందులో చిన్న లోపం కూడా కనిపెట్టలేకపోయాను. డాక్టర్ భద్రమ్ క్యారెక్టర్ థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయం" అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
"కష్టపడి కాదు.. ఇష్టపడి చేశాం": హీరో హర్ష నర్రా
గతంలో ‘మిస్సింగ్’, ‘రోటి కపడా రొమాన్స్’ సినిమాలతో ఆకట్టుకున్న హీరో హర్ష నర్రా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. "ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా నా ప్రయత్నం మాత్రం ఆగదు. ఈ ప్రాజెక్ట్ మేమంతా ఫ్రెండ్స్‌లా చాలా ఇష్టపడి చేశాం. గోపీ సుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్, కిట్టు గారి లిరిక్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.
‘మిస్సమ్మ’ టైటిల్ పెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి: డైరెక్టర్
డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ.. "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా.. దానికి 'సినిమా తీసి చూడు' అని కూడా యాడ్ చేయాలి, అంత కష్టం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ గారి 'మిస్సమ్మ', ఆ తర్వాత భూమిక గారి 'మిస్సమ్మ' క్లాసిక్స్‌గా నిలిచాయి. అంతటి ఐకానిక్ టైటిల్ వాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మా ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్ చూశాకే ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. మేము పెళ్లి వద్దని చెప్పడం లేదు, పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో ఈ సినిమాలో చూపిస్తున్నాం" అని క్లారిటీ ఇచ్చారు.
'కాలింగ్ సహస్ర' తర్వాత సేఫ్ హ్యాండ్స్‌లో ప్రాజెక్ట్
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌లో చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కాలింగ్ సహస్ర' తర్వాత అనుకున్న టైమ్‌కి, పక్కా బడ్జెట్‌తో ఔట్‌పుట్ తెప్పించడమే తమ మొదటి విజయమని ప్రొడ్యూసర్ చిరంజీవి పమిడి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా వచ్చి ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని టీమ్ ధీమాగా ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


