Modha Rathiri OTT: మాధవన్‌కు పిచ్చిగా నచ్చేసిన తమిళ మూవీ.. నవ్వీ నవ్వీ పొట్టచెక్కలే.. ఓటీటీలోని ఈ లేటెస్ట్ మూవీ చూశారా?

Modha Rathiri OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఓ తమిళ సినిమాపై ప్రముఖ నటుడు మాధవన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సినదే అని అనడం విశేషం.

Published on: Oct 6, 2026, 16:07:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Modha Rathiri OTT: 'ధురంధర్' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ (R Madhavan) రీసెంట్‌గా చూసిన ఒక చిన్న తమిళ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన 'మొద రాతిరి' (Modha Rathiri) మూవీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, చాలా కాలం తర్వాత ఒక తమిళ సినిమా చూసి క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Modha Rathiri OTT: మాధవన్‌కు పిచ్చిగా నచ్చేసిన తమిళ మూవీ.. నవ్వీ నవ్వీ పొట్టచెక్కలే.. ఓటీటీలోని ఈ లేటెస్ట్ మూవీ చూశారా?
Modha Rathiri OTT: మాధవన్‌కు పిచ్చిగా నచ్చేసిన తమిళ మూవీ.. నవ్వీ నవ్వీ పొట్టచెక్కలే.. ఓటీటీలోని ఈ లేటెస్ట్ మూవీ చూశారా?

మాధవన్ పోస్ట్, మూవీ టీమ్ రియాక్షన్

ట్విట్టర్, ఇన్‌‌స్టాగ్రామ్‌ వేదికగా మాధవన్ ఈ సినిమాపై ప్రత్యేక రివ్యూ పోస్ట్ చేశారు. "వాట్ ఏ బ్రిలియంట్ ఫిల్మ్.. చాలా రోజుల తర్వాత ఒక కోలీవుడ్ సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశా. స్క్రీన్‌ప్లే, విజువల్ స్టోరీ టెల్లింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి" అని రాసుకొచ్చారు.

అంతేకాకుండా సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా నవ్వుకున్నానని, పర్సనల్‌గా టీమ్ అందరికీ స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని క్యాప్షన్ ఇచ్చారు. మాధవన్ నుంచి వచ్చిన ఈ ఊహించని కాంప్లిమెంట్‌కి చిత్ర దర్శకుడు రాజా, హీరోయిన్ అనిష్మ అనిల్‌కుమార్ థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేశారు.

అసలు కథేంటి? నెట్‌ఫ్లిక్స్‌లో రెస్పాన్స్ ఎలా ఉందంటే?

ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీలో షెల్లీ కిషోర్, చేతన్, భగవతి పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించారు.

విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్న ఒక జంట, తమ శోభనం రాత్రి అనూహ్యంగా మిస్ అవుతారు. దాంతో రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవలు, బయటపడే రహస్యాలు, ఆ గందరగోళం మధ్యలోనే ఆ జంట ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. థియేటర్లలో మంచి రివ్యూస్ తెచ్చుకుని రూ. 8.73 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిన్న సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్‌తో ట్రెండ్ అవుతోంది.

రూ. 3000 కోట్ల కలెక్షన్లు.. మాధవన్ నెక్స్ట్

ఆర్ మాధవన్ రీసెంట్‌గా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ రెండు భాగాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 3000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. ఇందులో ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ నటనకు నార్త్, సౌత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ నాయుడు బయోపిక్ 'జీడీఎన్' (GDN) చిత్రంలో నటించి, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం తమిళంలో 'అదృష్టశాలి', బైలింగువల్ మూవీ 'సర్కిల్' సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు దుబాయ్‌లో ప్రసారమయ్యే 'గేమ్ చేంజర్స్' షోతో పాటు ZEE5 లో 'జీనా ఇసీ కా నామ్ హై 2.0' షోకి హోస్ట్‌‌గా వ్యవహరించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More