మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కొన్ని నెలల క్రితమే 'ఎల్2: ఎంపురాన్' (లూసిఫర్ 2)తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అతడు.. ఇప్పుడు 'వృషభ' (Vrusshabha) సినిమాతో తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫలితాన్ని చవిచూశాడు. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు.
వృషభ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా?

కొన్ని నెలల కిందట 'ఎంపురాన్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మోహన్‌లాల్.. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'వృషభ'తో గట్టి దెబ్బ తిన్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ట్రేడ్ పండితులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజైంది. ఆరోజు హాలిడే అయినా కూడా ఇండియాలో కేవలం రూ. 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ. 22 లక్షలు, మూడో రోజు (శనివారం) రూ. 24 లక్షలు మాత్రమే వచ్చాయి.
మూడు రోజులు కలిపితే ఇండియాలో ఈ సినిమా కలెక్షన్స్ జస్ట్ రూ. కోటి దాటాయి అంతే. ఓవర్సీస్ లో అయితే మరీ దారుణంగా కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయి. 'ఎంపురాన్' సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కానీ 'వృషభ' 3 రోజుల్లో కనీసం కోటిన్నర కూడా రాబట్టలేకపోయింది.
నిర్మాతకు కోలుకోలేని దెబ్బ
మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన వృషభ సినిమా కోసం దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా ఫుల్ రన్‌లో కనీసం రూ. 5 కోట్లు కూడా రాబట్టేలా లేదు. చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేసే పరిస్థితి ఉంది. దీంతో నిర్మాతకు 90% పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు.
వృషభ సినిమా గురించి..
నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ద్విపాత్రాభినయం (ఒకటి రాజు పాత్ర, మరొకటి మోడరన్ బిజినెస్ మ్యాన్) చేశాడు. దీనిని తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ డబ్బింగ్ వెర్షన్లన్నీ కలిపి 3 రోజుల్లో కేవలం రూ. 34 లక్షలే తెచ్చాయి.
{{/usCountry}}నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ద్విపాత్రాభినయం (ఒకటి రాజు పాత్ర, మరొకటి మోడరన్ బిజినెస్ మ్యాన్) చేశాడు. దీనిని తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ డబ్బింగ్ వెర్షన్లన్నీ కలిపి 3 రోజుల్లో కేవలం రూ. 34 లక్షలే తెచ్చాయి.
{{/usCountry}}మోహన్‌లాల్ తోపాటు సమర్జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిణి ద్వివేది ఇందులో నటించారు. క్రిటిక్స్ నుంచి నెగటివ్ రివ్యూలు రావడంతో జనాలు థియేటర్ల వైపు చూడలేదు.