మోహన్‌లాల్ ఎపిక్ ఫాంటసీ థ్రిల్లర్ రిలీజ్ ఆ రోజే.. వృషభ మూవీపై భారీ హైప్

మోహన్‌లాల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వృషభ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఎపిక్ ఫాంటసీ థ్రిల్లర్ పై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాల కలయికతో రూపొందింది. 

Published on: Nov 8, 2025, 16:11:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమాల్లో వృషభ ఒకటి. మోహన్‌లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా అభిమానులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు వృషభ మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ షూటింగ్ ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలు, భావోద్వేగాల కలయికతో ఒక గ్రాండ్ ఎమోషనల్ గాథగా తెరకెక్కింది.

వృషభ మూవీ నుంచి మోహన్ లాల్ స్టిల్
వృషభ మూవీ నుంచి మోహన్ లాల్ స్టిల్

వృషభ రిలీజ్ డే

ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మోహన్‌లాల్ ఒక సరికొత్త వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమాలోని అద్భుతమైన విజువల్స్, ఆయన శక్తివంతమైన యోధుడి అవతార్‌ను చూపించారు. ఈ క్లిప్‌ను పంచుకుంటూ ఆయన ఇలా రాశారు. “కొన్ని కథలు సినిమా కంటే ఎక్కువ. అవి వారసత్వాలు. ఈ క్రిస్మస్‌కు ఆ వారసత్వం వృషభ రూపంలో గర్జిస్తూ జీవం పోసుకోవడాన్ని చూడండి. భావోద్వేగం, వైభవం, విధిని సెలబ్రేట్ చేసే చిత్రం. డిసెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది” అని పోస్టు చేశారు.

దీంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ఇది మోహన్‌లాల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటని కామెంట్లు చేస్తున్నారు.

విడుదల తేదీ మార్పు

వృషభ చిత్రం వాస్తవానికి నవంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. కానీ మెరుగైన పోస్ట్-ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం తేదీని వాయిదా వేశారు. అంతకుముందు, అక్టోబర్‌లో మోహన్‌లాల్ ఒక ఆకట్టుకునే పోస్టర్, టీజర్‌ను విడుదల చేస్తూ.. “నిరీక్షణకు తెరపడింది, నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. వృషభ ప్రపంచంలోకి స్వాగతం. టీజర్ కేవలం ఒక చిన్నది మాత్రమే.. అసలైన ఆశ్చర్యం వేచి ఉంది” అని రాశారు.

వృషభ గురించి

కన్నడ చిత్రసీమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నంద కిషోర్ 'వృషభ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. షనయా కపూర్, జహ్రా ఎస్ ఖాన్, రోషన్ మేక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలాజీ టెలిఫిల్మ్స్ పతాకంపై ఏక్తా ఆర్ కపూర్, శోభా కపూర్, కనెక్ట్ మీడియా, ఏవీఎస్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ కథను నంద కిషోర్ రాశారు. ఇది ఒక ఎమోషనల్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రం తెలుగు, మలయాళంలో ఒరిజినల్‌గా, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More