దసరా, దివాళీ పండుగలకు విడుదలైన సినిమాలు.. ఏది హిట్టు? మరేది ఫట్టు?

అక్టోబర్ నెలలో రెండు అతి పెద్ద పండుగలు వచ్చాయి. ఇక పండుగలకు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అలాగే, దసరా, దీపావళికి తెలుగులో బాగానే సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. రిలీజ్ అయిన స్ట్రయిట్ నుంచి తెలుగు డబ్బింగ్ సినిమాల్లో ఏది హిట్ అయింది, మరేది ఫట్ అయిందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 2, 2025, 09:20:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండుగలు సినిమాలకు చాలా అనువుగా ఉంటాయి. హాలీడేస్ కారణంగా ఎక్కువగా ఆడియెన్స్ చూసేందుకు వీలుంటుందను ఈ పండుగలను టార్గెట్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటారు. అలా అక్టోబర్ నెలలో రెండు అతి పెద్ద పండుగలైన దసరా, దీపావళి వచ్చాయి.

దసరా, దివాళీ పండుగలకు విడుదలైన సినిమాలు.. ఏది హిట్టు? మరేది ఫట్టు?
దసరా, దివాళీ పండుగలకు విడుదలైన సినిమాలు.. ఏది హిట్టు? మరేది ఫట్టు?

అక్టోబర్ నెలలో

అలాగే, అక్టోబర్ నెలలో ప్రతివారం సరికొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. దసరా, దీపావళితోపాటు అక్టోబర్ మంత్ మొత్తంలో తెలుగ స్ట్రయిట్ నుంచి డబ్బింగ్ సినిమాల దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్ అయింది, మరేది ఫట్ అయిందో తెలుసుకుందాం.

అక్టోబర్ మొదటి వారంలో అంటే దసరా సందర్భంగా పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ కావడంతో మిగతా సినిమాల సందడి లేకుండాపోయింది. కానీ, ధనుష్ ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1 వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఓజీ పర్వాలేదనిపించుకుంది. ఇడ్లీ కొట్టి ఫ్లాప్ కాగా కాంతార 2 మాత్రం బాక్సాఫీస్ దుమ్ముదులిపింది.

రెండో వారం చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శశివదనే, కానిస్టేబుల్, అరి సినిమాలు ఉన్నాయి. శశివదనే అంతంత మాత్రంగానే పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ నటించిన కానిస్టేబుల్ అసలు విడుదల అయిన విషయమే తెలియకుండా వెళ్లిపోయింది.

అరి సినిమాకు మంచి టాక్

ఇక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వచ్చిన అరి మాత్రం బాగానే ఆకట్టుకుంది. వీ జయశంకర్ దర్శకత్వం వహించిన అరి సినిమా అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసింది. విడుదలైన పది రోజుల తర్వాత కూడా థియేటర్లలో అరి మూవీని ఆడియెన్స్ చూడటాన్ని డైరెక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో అరి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మూడో వారంలో దీపావళి సందర్బంగా నాలుగు సినిమాలు మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ పోటీ పడ్డాయి. వీటిలో ముందుగా విడుదలైన మిత్ర మండలి పెద్దగా నవ్వించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా డిఫరెంట్ కాన్సెప్ట్ అని పేరు తెచ్చుకున్న యావరేజ్‌గా నిలిచింది.

ఇక ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుల డ్యూడ్ సినిమాకు మొదటి నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. దీంతోపాటు కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సినిమా కూడా బాగానే ఆడింది. మొదటి వారం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ రెండో వారం నుంచి కలెక్షన్లలో ఊపందుకుంది.

డ్యూడ్ హవా

ఇక నాలుగో వారంలో డబ్బింగ్ మూవీ బైసన్, ధర్మవరం వంటి సినిమాలు వచ్చాయి. ఇవి రిలీజ్ అయిన కూడా డ్యూడ్, కె ర్యాంప్ సినిమాల హవానే సాగింది. అయితే, మధ్యలో రష్మిక మందన్నా హారర్ కామెడీ చిత్రం థామా వచ్చిన పెద్దగా మెప్పించకలేకపోయింది.

ఇక చివరిలో అక్టోబర్ 31న రాజమౌళి బాహుబలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర, కర్మణ్యే వాధికారస్తే సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కర్మణ్యే వాధికారస్తే ఊసు లేకుండా పోతే బాహుబలి ది ఎపిక్ హవానే కొనసాగింది. సినిమాకు మిశ్రమ రెస్పాన్స్ వస్తున్పప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ కలెక్షన్సే ఎక్కువగా ఉంటున్నాయి.

ఇక రవితేజ, శ్రీలీల చేసిన రెండో సినిమా మాస్ జాతరకు నెగెటివ్ టాక్ రావడం, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అక్టోబర్‌లో రిలీజ్ అయిన ఇన్ని సినిమాల్లో దసరాకు రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1, దీపావళికి విడుదలైన డ్యూడ్ వంటి డబ్బింగ్ సినిమాలే భారీ విజయాన్ని అందుకున్నాయి. ఓజీ, కె ర్యాంప్ మోస్తరు సక్సెస్ సాధించాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More