OTT: మలయాళ సినిమా ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో రీసెంట్‌గా థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times). ఈ సినిమా అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేసింది.

థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. జులై 3 నుంచి డిజిటల్ వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ సాధించిన సినిమా ఇది.
ప్రేమలు నస్లేన్ వన్ మ్యాన్ షో
ఈ సినిమాకు 'మలయాళ సినిమాపై ఒక లవ్ హేట్ లెటర్' అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా సెన్సార్ బోర్డ్ (CBFC) నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సీన్లు కట్ చేయకుండా థియేటర్లలో ప్రదర్శించారంటూ ఈ మూవీ మేకర్స్‌పై లీగల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జియోహాట్‌స్టార్ ఈ క్రేజీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది.
గతంలో 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్' లాంటి కల్ట్ సైకలాజికల్ డార్క్ కామెడీతో సౌత్ ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సృష్టించిన 'సక్సెస్ ట్రైలజీ' లో ఇదొక సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
'ప్రేమలు' సినిమాతో పాన్-ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ సెన్సేషన్ నస్లేన్ గఫూర్ (Naslen) ఇందులో వినీత్ మాధవన్ అనే ఒక కాబోయే డైరెక్టర్ క్యారెక్టర్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన డెబ్యూ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా ఉండాలని కలలు కనే ఒక యంగ్ ఫిల్మ్ మేకర్.. ఇండస్ట్రీలో ఉండే గేట్‌కీపర్స్, పాలిటిక్స్, ఈగోల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడనేది ఈ సినిమా అసలు కథ.
హాలీవుడ్ రేంజ్ రివ్యూస్.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్
{{/usCountry}}'ప్రేమలు' సినిమాతో పాన్-ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ సెన్సేషన్ నస్లేన్ గఫూర్ (Naslen) ఇందులో వినీత్ మాధవన్ అనే ఒక కాబోయే డైరెక్టర్ క్యారెక్టర్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన డెబ్యూ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా ఉండాలని కలలు కనే ఒక యంగ్ ఫిల్మ్ మేకర్.. ఇండస్ట్రీలో ఉండే గేట్‌కీపర్స్, పాలిటిక్స్, ఈగోల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడనేది ఈ సినిమా అసలు కథ.
హాలీవుడ్ రేంజ్ రివ్యూస్.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్
{{/usCountry}}ఈ మాలీవుడ్ టైమ్స్ సినిమా కథ ఫేమస్ నవల 'ఫౌంటెన్‌హెడ్' స్పూర్తితో రాశారు. ఒక క్రియేటివ్ వ్యక్తి తన ఒరిజినాలిటీని కాపాడుకోవడానికి, కమర్షియల్ ఇండస్ట్రీతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు.
"మాలీవుడ్ టైమ్స్ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను చాలా బోల్డ్‌గా ఎండగట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీతో సాగితే.. సెకండ్ హాఫ్ లో కథ చాలా సీరియస్ గా, ఇంటెన్స్ గా మారుతుంది" అని ప్రముఖ మీడియా హౌస్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన రివ్యూలో పేర్కొంది.
ఈ సినిమాలో నస్లేన్ తో పాటు షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్, సంగీత్ ప్రతాప్, జగదీష్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విశ్వజిత్ ఓడుక్కత్తిల్ సినిమాటోగ్రఫీ ఈ డార్క్ కామెడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఆశిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.