Successful Actor: ఇండియాలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్ హీరో.. 1000కిపైగా సినిమాలు.. 400కుపైగా హిట్స్
Successful Actor: ఇండియాలో అత్యధిక హిట్స్ అందుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు. ఆ హీరో పేరు ప్రేమ్ నజీర్. ఆ స్టార్ హీరో అమితాబ్, రజనీ, షారుఖ్ లాంటి స్టార్లందరి హిట్స్ కంటే కూడా ఎక్కువ సొంతం చేసుకోవడం విశేషం.
Successful Actor: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక హిట్లు ఇచ్చిన హీరో ఎవరు అంటే మనకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లేదా షారుఖ్ ఖాన్ పేర్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ ముగ్గురు స్టార్ల హిట్లు అన్నీ కలిపినా ఒకే ఒక్క మలయాళ హీరో సాధించిన రికార్డులో సగం కూడా ఉండవంటే నమ్ముతారా? ఆ అసాధ్యమైన రికార్డును క్రియేట్ చేసిన లెజెండరీ నటుడే మలయాళ 'ఎవర్‌గ్రీన్ హీరో' ప్రేమ్ నజీర్.

ప్రేమ్ నజీర్ వర్సెస్ ఇతర సూపర్ స్టార్లు
• నటుడు: ప్రేమ్ నజీర్
• మొత్తం సినిమాలు: 1000కిపైనే.. (720+ లీడ్ యాక్టర్‌గా..)
• మొత్తం బాక్సాఫీస్ హిట్స్: 400+ (50+ బ్లాక్‌బస్టర్స్)
• వరల్డ్ రికార్డ్: ఒకే ఏడాది మెయిన్ లీడ్‌గా 39 సినిమాలు రిలీజ్ (1979)
• అమితాబ్ బచ్చన్ కెరీర్: 60 హిట్స్ (11 బ్లాక్‌బస్టర్స్)
• రజనీకాంత్ కెరీర్: 70 Hits (12 బ్లాక్‌బస్టర్స్)
• షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కెరీర్: ఒక్కొక్కరు 35-38 హిట్స్
• మొత్తంగా ముగ్గురి కెరీర్ (అమితాబ్ బచ్చన్ + రజనీకాంత్ + షారుఖ్ ఖాన్): 150 హిట్స్ మాత్రమే..
400 హిట్లు.. అమితాబ్, రజనీకాంత్ కంటే ఎంతో ఎత్తులో..
సినీ ప్రపంచంలో సక్సెస్ రేట్ ఆధారంగా చూస్తే దిలీప్ కుమార్ టాప్‌లో ఉంటారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో షారుఖ్ ఖాన్ ముందుంటారు. థియేటర్ల ఫుట్‌ఫాల్స్ పరిగణనలోకి తీసుకుంటే అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో నిలుస్తారు. కానీ కెరీర్‌లో ఇచ్చిన మొత్తం హిట్ సినిమాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం ఇండియాలో ప్రేమ్ నజీర్ దరిదాపుల్లోకి కూడా ఏ స్టార్ హీరో రాలేరు.
మలయాళ ప్రేక్షకులు ప్రేమగా 'నిత్యహరిత నాయకన్' (ఎవర్‌గ్రీన్ హీరో) అని పిలుచుకునే ప్రేమ్ నజీర్.. తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఏకంగా 1000కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో 720కి పైగా చిత్రాల్లో ఆయనే మెయిన్ హీరోగా చేయడం విశేషం. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆయన కెరీర్‌లో ఏకంగా 400కి పైగా హిట్లు ఇచ్చారు. అందులో 50కి పైగా సినిమాలు ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.
బాలీవుడ్ స్టార్ల హిట్లు అన్నీ కలిపినా సగం కూడా కావు
హిందీ చిత్రసీమను దశాబ్దాలుగా ఏలిన అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో దాదాపు 60 హిట్లు ఉంటే.. అందులో 11 బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ 70 హిట్లతో 12 బ్లాక్‌బస్టర్లు సాధించారు. ఇక ఇప్పటి బాలీవుడ్ సూపర్‌స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ తలా 35 నుంచి 38 హిట్లు సాధించారు. సల్మాన్ ఖాన్ అత్యధికంగా 15 బ్లాక్‌బస్టర్లు దక్కించుకున్నారు.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ ముగ్గురి కెరీర్ హిట్లను కలిపినా కూడా కేవలం 150 హిట్లు మాత్రమే అవుతాయి. ప్రేమ్ నజీర్ ఒక్కడే సాధించిన 400 హిట్లలో ఇది సగం కూడా కాకపోవడం ఆయన రేంజ్ ఏంటో స్పష్టం చేస్తోంది.
ఒకే ఏడాదిలో 39 సినిమాలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్
1929లో అబ్దుల్ ఖాదర్‌గా జన్మించిన ప్రేమ్ నజీర్.. నాటకాల ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1952లో వచ్చిన 'విశప్పింటే విలి' సినిమాతో వెండితెరకు పరిచయమై ప్రేమ్ నజీర్‌గా పేరు మార్చుకున్నారు. 1970ల్లో ఆయన ఎంత బిజీగా ఉండేవాళ్లంటే, ఒకే సమయంలో 3-4 సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటూ కొద్ది వారాల్లోనే పూర్తి చేసేవారు.
1979లో ఒకే సంవత్సరంలో ఏకంగా 39 సినిమాల్లో హీరోగా నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 1980ల నాటికి మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి యంగ్ హీరోలు రావడంతో ఆయన క్యారెక్టర్ రోల్స్ వైపు మారారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరితో కలసి ఒక పెద్ద సినిమా డైరెక్ట్ చేయాలని ప్రేమ్ నజీర్ భావించారు. కానీ అనారోగ్యం కారణంగా 1989లో 59 ఏళ్ల వయసులోనే ఆయన కన్నుమూశారు. ఆయన చనిపోయాక 1990లో మోహన్‌లాల్ తో కలసి నటించిన 'కడథనాదన్ అంబాడి' ఆఖరి చిత్రంగా విడుదలైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


