నెట్‌ఫ్లిక్స్‌లో ఈమధ్యే వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. కశ్మీర్ నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా దూకుడు కొనసాగిస్తోంది. గత వారం ఓటీటీలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సినిమాలు ఏవో చూడండి.
టాప్ 5 సినిమాలు ఇవే

ఓటీటీలో గతవారం అంటే నవంబర్ 10 నుంచి 16 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (నవంబర్ 17) రిలీజ్ చేసింది. వీటిలో కాంతార ఛాప్టర్ 1 మూవీ మరోసారి టాప్ లో నిలిచింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా తొలి రెండు స్థానాల్లోనే ఉంటూ వస్తోంది. గతవారం 3.3 మిలియన్ వ్యూస్ తో ఈ సినిమా టాప్ లో నిలవడం విశేషం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ థ్రిల్లర్ దూకుడు
ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టిన హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా. ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది. గతవారం ఈ మూవీకి 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మానవ్ కౌల్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా కశ్మీర్ లోని బారాముల్లా టౌన్ లో అమ్మాయిల మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది.
జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న అత్యధిక వసూళ్ల మలయాళ సినిమా లోకా ఛాప్టర్ 1 చంద్ర మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాకు గత వారం 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చిన మరో మూవీ జాలీ ఎల్ఎల్బీ 3. గత వారం ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చిన మరో మూవీ జాలీ ఎల్ఎల్బీ 3. గత వారం ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
{{/usCountry}}జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన హాలీవుడ్ మూవీ ది ఫెంటాస్టిక్ ఫోర్ సినిమా ఐదో స్థానంలో ఉంది. దీనికి గత వారం 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ లెక్కన టాప్ 5లో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఓటీటీల్లోని సినిమాలు నిలిచాయి.