ఓటీటీలో టాప్ 5 మూవీస్ ఇవే.. కామెడీ, రొమాన్స్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు.. తిరుగులేని కన్నడ బ్లాక్‌బస్టర్
ఓటీటీలో గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం. తాజాగా ఆర్మాక్స్ మీడియో నవంబర్ 17 నుంచి 23 మధ్య వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను రిలీజ్ చేసింది.
ఓటీటీలో ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని వారాలుగా కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార ఛాప్టర్ 1 టాప్ లోనే కొనసాగుతోంది. మరి టాప్ 5లో ఉన్న ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

ఓటీటీలో టాప్ 5 మూవీస్ ఇవే
ఓటీటీలో ప్రతివారం ఎక్కువ వ్యూస్ పొందే సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గతవారం అంటే నవంబర్ 17 నుంచి 23 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్రేక్షకులు ఆదరించిన సినిమాల లిస్టును సోమవారం (నవంబర్ 24) రిలీజ్ చేశారు.
ఇందులో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార ఛాప్టర్ 1 తొలి స్థానంలో ఉంది. గతవారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డ్యూడ్ 2.4 మిలియన్ వ్యూస్ తో నిలిచింది.
మూడో స్థానంలో హారర్ థ్రిల్లర్ మూవీ, నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న బారాముల్లా ఉంది. దీనికి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాలుగో స్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఐదో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోని జాలీ ఎల్ఎల్‌బీ 3 మూవీ ఉంది. దీనికి 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
టాప్ 5 నాన్ ఫిక్షన్ షోస్ ఇవే
ఇక సినిమాలు, వెబ్ సిరీస్ కాకుండా టాప్ 5 నాన్ ఫిక్షన్ షోస్ గురించి కూడా ఆర్మాక్స్ మీడియా వెల్లడిస్తుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 తొలి వారం నుంచే టాప్ లో కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా 7.1 మిలియన్ వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జియోహాట్‌స్టార్ లోని లాఫర్ చెఫ్స్ సీజన్ 3 ఉంది. దీనికి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మూడో స్థానంలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 16 ఉంది. దీనికి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అదే సోనీ లివ్ లోని కౌన్ బనేగా కరోడ్‌పతి షో 1.4 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో, జియోహాట్‌స్టార్ లోని బిగ్ బాస్ తమిళం సీజన్ 9.. 1.3 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో నిలిచాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


