ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ దూకుడు.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 సిరీస్ ఇవే

ఓటీటీలో గత వారం అంటే నవంబర్ 17 నుంచి 23 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సత్తా చాటింది. తొలి స్థానంలో నిలిచింది.

Published on: Nov 24, 2025, 21:03:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చీ రాగానే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తన దూకుడు మొదలుపెట్టింది. తొలి మూడు రోజుల్లోనే టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాలో తొలి స్థానానికి దూసుకెళ్లింది. తాజాగా సోమవారం (నవంబర్ 24) ఆర్మాక్స్ మీడియా ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా రిలీజ్ చేసింది.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ దూకుడు.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 సిరీస్ ఇవే
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సరికొత్త సీజన్ దూకుడు.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 సిరీస్ ఇవే

టాప్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3

ఓటీటీలో గత వారం అంటే నవంబర్ 17 నుంచి 23 మధ్య ఏ వెబ్ సిరీస్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయో తెలుసా? ఊహించినట్లే నాలుగేళ్ల తర్వాత మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దుమ్ము రేపింది. తొలి మూడు రోజుల్లోనే ఈ కొత్త సీజన్ కు ఏకంగా 6.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మూడో స్థానంలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మహారాణి నాలుగో సీజన్ ఉంది. దీనికి 2.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాలుగో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న కో-ఎడ్ ఉంది. దీనికి గత వారం 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మహాభారత్: ఏక్ మహాయుద్ధ్ ఉంది. దీనికి 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి..

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గత శుక్రవారం (నవంబర్ 21) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. రెండో సీజన్ 2021లో రాగా.. ఏకంగా నాలుగేళ్ల తర్వాత ఈ కొత్త సీజన్ రావడంతో అభిమానులు ఎగబడి చూసేస్తున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి లీడ్ రోల్స్ లో తిరిగి వచ్చారు.

ఈ కొత్త సీజన్ ఈశాన్య భారతం, అక్కడి డ్రగ్స్, ఉగ్రవాదం చుట్టూ తిరిగింది. ఏడు ఎపిసోడ్ల పాటు ఈ మూడో సీజన్ సాగింది. ఆరు గంటలకుపైగా ఉన్న ఈ కొత్త సీజన్ కు మిశ్రమ స్పందన వచ్చింది. తొలి రెండు సీజన్ల స్థాయిలో ఈ మూడో సీజన్ లేదని పలువురు అభిమానులు రివ్యూలు ఇచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More