ఇండియాలో గత వారం రోజుల్లో ఓటీటీలో జనాలు దేనికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారో, వేటికి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయో చెబుతూ ఆర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చేసింది. మార్చి 16 నుంచి 22 వరకు ఇండియాలో అత్యధికంగా చూసిన టాప్ 10 ఓటీటీ కంటెంట్ వివరాలను ఆర్మాక్స్ మీడియా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ టీవీ షోలు అన్నీ ఉన్నాయి. ఈ వారం లిస్ట్‌ను ఒకసారి గమనిస్తే.. జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ ఏకంగా ఐదు షోలతో టాప్ 10 లిస్ట్‌ను పూర్తిగా డామినేట్ చేసింది.
టాప్ 10 ఓటీటీ కంటెంట్ లిస్ట్ ఇదే

మొదటి స్థానం: జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ది 50' షో ఏకంగా 8.8 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని, మిగతా వాటికి అందనంత ఎత్తులో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచి దుమ్ములేపింది.
రెండో స్థానం: జియో హాట్‌స్టార్‌కే చెందిన పాపులర్ సిరీస్ ‘నాగిన్ సీజన్ 7’కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇది 4.6 మిలియన్ వ్యూస్‌తో సత్తా చాటింది.
మూడో స్థానం: మన ఎవర్ గ్రీన్ కామెడీ షో 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' 3.6 మిలియన్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ఇది యూట్యూబ్ సోనీ సబ్, సోనీ లివ్ యాప్‌లో అందుబాటులో ఉంది.
నాలుగో స్థానం: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన భారీ యాక్షన్ సినిమా 'బోర్డర్ 2' 3.5 మిలియన్ల వ్యూస్ రాబట్టి ఈ లిస్ట్‌లో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.
ఐదో స్థానం: జియో హాట్‌స్టార్ టెలివిజన్ డ్రామా 'అనుపమ' 3.4 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది.
ఆరో స్థానం: అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమ్ అవుతున్న 'సంకల్ప్' షో 3.3 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని ఆరో స్థానంలో ఉంది.
ఏడో స్థానం: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్ సీజన్ 3'.. 3.2 మిలియన్ వ్యూస్ రాబట్టింది. యూత్‌కి ఈ సిరీస్ భలే కనెక్ట్ అయిపోయింది.
{{/usCountry}}ఏడో స్థానం: అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్ సీజన్ 3'.. 3.2 మిలియన్ వ్యూస్ రాబట్టింది. యూత్‌కి ఈ సిరీస్ భలే కనెక్ట్ అయిపోయింది.
{{/usCountry}}ఎనిమిదో స్థానం: జియో హాట్‌స్టార్‌లో వస్తున్న 'లాఫర్ షెఫ్స్ సీజన్ 3' షో కూడా 3.2 మిలియన్ వ్యూస్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉంది.
తొమ్మిదో స్థానం: అనిల్ కపూర్ నటించి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన 'సుబేదార్' మూవీ 2.9 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని తొమ్మిదో స్థానంలో నిలిచింది.
పదో స్థానం: జియో హాట్‌స్టార్ ఓటీటీలో వస్తున్న 'స్ప్లిట్స్‌విల్లా ఎక్స్6' షో కూడా 2.9 మిలియన్ వ్యూస్‌తో ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు సంపాదించింది.
మొత్తానికి గత వారం చూసుకుంటే ఓటీటీలో రియాలిటీ షోస్, యాక్షన్ సినిమాలు, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని జానర్స్‌ను ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు ఈ టాప్ 10 లిస్ట్ చూస్తే స్పష్టమవుతోంది.