ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్న టాప్ 5 నాన్ ఫిక్షన్ షోస్ ఏవో తెలుసా? ఈ షోస్ విషయంలో జియోహాట్‌స్టార్ పంట పండిందనే చెప్పాలి. ఎందుకంటే టాప్ 5లో నాలుగు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నవే. ఇక మూడు భాషలకు చెందిన బిగ్ బాస్ షోలు కూడా ఇందులో ఉండటం విశేషం.
బిగ్ బాస్ హిందీ సీజన్ 19

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఈ షోకి గత వారం ఏకంగా 7 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. జియోహాట్‌స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త సీజన్ ప్రారంభమైన తొలి వారం నుంచే టాప్ లో ఉంటూ వస్తోంది. ప్రతివారం వ్యూస్ పెరుగుతూనే ఉండటం విశేషం.
పతీ పత్నీ ఔర్ పంగా
ఇది కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీలో వస్తున్న షో. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే జడ్జిగా ఉన్న షో ఇది. దీనికి గత వారం 2.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో ఉన్నా కూడా.. బిగ్ బాస్ హిందీతో పోలిస్తే చాలా తక్కువ వ్యూస్ మాత్రమే ఉన్నాయి.
కౌన్ బనేగా కరోడ్‌పతి
ఇక ఈ లిస్టులో ఉన్న మరో షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 17. ఇది సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే క్విజ్ షో ఇది. ఈ షోకి గత వారం 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది కూడా కొత్త సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ టాప్ 5లో ఉంటూ వస్తోంది.
బిగ్ బాస్ తమిళం సీజన్ 9
టాప్ 5లో ఉన్న మరో బిగ్ బాస్ షో ఇది. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళం సీజన్ 9 కూడా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి గత వారం 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
{{/usCountry}}టాప్ 5లో ఉన్న మరో బిగ్ బాస్ షో ఇది. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళం సీజన్ 9 కూడా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి గత వారం 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
{{/usCountry}}చివరిగా ఐదో స్థానంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి గత వారం 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఈసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.