Dhurandhar 2: ధురంధర్ 2 ఒక బక్వాస్-రణ్‌వీర్ సినిమాపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్- హింసను ప్రేరేపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు
Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమాపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను అర్థంలేనిదిగా అభివర్ణిస్తూ, హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2పై ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ చిత్రం కేవలం 'బక్వాస్' (అర్థం లేనిది) అని కొట్టిపారేశారు.

మూడు గంటల టైమ్ వేస్ట్
రీసెంట్ గా టైమ్స్ నౌ సమ్మిట్‌లో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ధురంధర్ చిత్రాల గురించి అడిగినప్పుడు ఆయన.. "అది కూడా ఒక సినిమానా? మూడు గంటల టైమ్ వేస్ట్. బక్వాస్’’ అని బదులిచ్చారు. తనకు మూడు గంటల పాటు సినిమా చూసే సమయం లేదని, ప్రజలు తన మాటలను ఒక గంట వింటే చాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
హింసను ప్రోత్సహిస్తూ
ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు సమాజంలో హింసను ప్రోత్సహిస్తున్నాయని ఒవైసీ ఆరోపించారు. మూడు గంటల సినిమా చూశాక, ముస్లింలను తిట్టాలా వద్దా అని ప్రేక్షకులు ఆలోచించేలా ఈ కథలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చిత్రాలను చూడటానికి ఎవరికీ సమయం ఉండదని అసదుద్దీన్ సంచలన కామెంట్లు చేశారు.
హైదరాబాదీ స్టైల్‌లో కౌంటర్
ప్రపంచమంతా ఈ సినిమాను చూసి సంతోషిస్తోంది కదా అని హోస్ట్ ప్రశ్నించగా, అసదుద్దీన్ ఒవైసీ తనదైన హైదరాబాదీ శైలిలో సమాధానమిచ్చారు. "హైదరాబాద్‌లో ఒక సామెత ఉంది. ఇలాంటి విషయాలను హృదయంలోకి తీసుకోకండి, నేరుగా సమాధి (ముర్డే) వద్దకు తీసుకెళ్లి వదిలేయండి" అంటూ అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.
ధురంధర్ బాక్సాఫీస్ రికార్డులు
రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ధురంధర్ చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. భారతదేశంలోనే ఈ చిత్రం రూ.840 కోట్లు రాబట్టడం విశేషం.
సీక్వెల్‌తో సరికొత్త చరిత్ర
ఈ ఏడాది మార్చి 19న విడుదలైన 'ధురంధర్ 2' మొదటి భాగం కంటే వేగంగా దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారతదేశంలో రూ.715 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1128 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2026లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారత గూఢచారి సాహసం
రణ్‌వీర్ సింగ్ ఈ ధురంధర్ 2 చిత్రంలో భారత గూఢచారి జస్కిరాత్ సింగ్ రంగి అలియాస్ హమ్జా అలీ మజారి పాత్రలో నటించాడు. ఐబి డైరెక్టర్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) అతడిని పాకిస్తాన్‌లోని లియారీకి పంపడం, అక్కడ జరిగే పోరాటాల చుట్టూ మూవీ స్టోరీ సాగుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


