...
...
Next Story

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అదిరిపోయిన ట్రైలర్

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 1) రిలీజైంది. బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ఇందులో ఓ సీరియల్ కిల్లర్ పాత్రలో నటించడం విశేషం.

Published on: Dec 1, 2025, 20:37:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ 'ధక్ ధక్' గర్ల్ మాధురీ దీక్షిత్ మరోసారి డిజిటల్ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. 2022లో వచ్చిన 'ది ఫేమ్ గేమ్' తర్వాత ఆమె నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'మిసెస్ దేశ్‌పాండే' (Mrs Deshpande). విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను సోమవారం (డిసెంబర్ 1) మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మాధురీ మునుపెన్నడూ చూడని విధంగా ఒక సీరియల్ కిల్లర్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మిసెస్ దేశ్‌పాండే ట్రైలర్

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అదిరిపోయిన ట్రైలర్
ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీరియల్ కిల్లర్‌గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. అదిరిపోయిన ట్రైలర్

'మిసెస్ దేశ్‌పాండే' ట్రైలర్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా, భయానకంగా ఉంది. మాధురీ దీక్షిత్ తన దిల్ తో పాగల్ హై మూవీలోని సూపర్ హిట్ పాట "భోలీ సీ సూరత్" పాడుతూ, ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.

ఆ తర్వాత ఆమె జైలు కటకటాల వెనుక ఉండి.. "నేను లోపల ఉన్నాను, అంటే బయట ఎవరో నా స్టైల్‌ని కాపీ చేస్తున్నారు" అని చెప్పే డైలాగ్ ఈ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. బయటకు ఎంతో కూల్‌గా, అమాయకంగా కనిపించే మిసెస్ దేశ్‌పాండే (మాధురీ), గతంలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అనేది ఈ కథలోని ప్రధాన ట్విస్ట్. డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

మిసెస్ దేశ్‌పాండే వెబ్ సిరీస్ గురించి..

మిసెస్ దేశ్‌పాండే ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మాధురీ దీక్షిత్ ఇందులో సీరియల్ హత్యల నేరానికి 25 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపిస్తోంది. అయితే అచ్చం ఆమె పద్ధతిలోనే బయట వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. ఆ కొత్త కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీసులకు మిసెస్ దేశ్‌పాండే సహాయం అవసరమవుతుంది.

ఇది ఫ్రెంచ్ సిరీస్ 'లా మాంటే' (La Mante) కు అధికారిక రీమేక్. 'హైదరాబాద్ బ్లూస్', 'ఇక్బాల్' వంటి చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ దీనిని రూపొందించాడు. మాధురీ దీక్షిత్ టైటిల్ రోల్ పోషించగా, ఆమె కొడుకు/డిటెక్టివ్ పాత్రలో మరాఠీ నటుడు సిద్ధార్థ్ చాందేకర్ కనిపించనున్నాడు. ప్రియాంశు ఛటర్జీ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మాధురీ దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావచ్చు. అమాయకమైన ముఖం వెనుక ఉన్న హింసాత్మక ప్రపంచాన్ని ఆమె ఎలా చూపించిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks