...
...
Next Story

Mrunal Thakur: యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ రూమ‌ర్లు- మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్ష‌న్‌- రిలాక్స్ బ్రో- అలా చేస్తే వ్యూస్!

Mrunal Thakur: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు కోపమొచ్చింది. యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తో డేటింగ్ రూమర్స్ ను ఆమె కొట్టిపారేసింది. ముంబైలోని ఒకే కేఫ్ నుంచి ఇద్దరూ విడివిడిగా బయటకు వచ్చిన విజువల్స్ ఆధారంగా నెటిజన్లు సృష్టించిన ఈ రూమర్స్‌కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.

Published on: Aug 8, 2026, 18:36:28 IST
Advertisement

Mrunal Thakur: ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ఒక ప్రముఖ కేఫ్ బయట నటి మృణాల్ ఠాకూర్ (34), క్రికెటర్ యశస్వి జైస్వాల్ (24) విడివిడిగా కెమెరాలకు చిక్కారు. ఈ విజువల్స్‌ను కలిపేసి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు వీడియోలను వైరల్ చేశాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన మృణాల్ ఠాకూర్.. నేరుగా కామెంట్ పెడుతూ నెటిజన్లకు క్లాస్ పీకింది.

బ్రో రిలాక్స్

యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ రూమ‌ర్లు- మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్ష‌న్‌- రిలాక్స్ బ్రో- అలా చేస్తే వ్యూస్!
యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ రూమ‌ర్లు- మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్ష‌న్‌- రిలాక్స్ బ్రో- అలా చేస్తే వ్యూస్!

"బ్రో కాస్త రిలాక్స్ అవ్వండి.. మేమిద్దరం కలిసి ఉన్న ఒక్క విజువల్ అయినా చూపించగలరా? చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి రూమర్స్‌ను ఎలా నమ్ముతారు? దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి.

కాస్త ఆ 'జెన్ జెడ్' (Gen Z) యువతను చూసి నేర్చుకోండి.. సరైన అంశాలపై వీడియోలు చేస్తే మీకు మరిన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి" అంటూ మృణాల్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

గతంలో ధనుష్‌తో పెళ్లి రూమర్స్

మృణాల్ ఠాకూర్‌పై ఇలాంటి ప్రేమ రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది (2025) ఆగస్టులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కూడా ఆమెను ముడిపెడుతూ వార్తలు వచ్చాయి.

మృణాల్ ఠాకూర్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోకు ధనుష్ హాజరై, ఆమెను ఎంతో ఆప్యాయంగా పలకరించడమే ఈ రూమర్లకు కారణమైంది. వీరిద్దరూ 2026 లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. అయితే, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

మృణాల్ ఠాకూర్ కామెంట్

సీరియల్స్ నుంచి టాలీవుడ్ స్టార్‌డమ్ వరకు

కానీ టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతా రామం' (2022), నానితో చేసిన 'హాయ్ నాన్న' (2023) చిత్రాలు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. తెలుగు ప్రేక్షకులు ఆమెకు స్టార్ హోదాను కట్టబెట్టారు. ఇటీవల వరుణ్ ధావన్ సరసన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రంలో మెరిసిన మృణాల్, ప్రస్తుతం హిందీలో 'పూజా మేరీ జాన్', తెలుగులో 'రాకా' వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks