Mrunal Thakur: వెంటనే ఆపేయాలి.. లేదంటే లీగల్ యాక్షన్.. డీప్ ఫేక్ కంటెంట్‌పై మృణాల్ ఠాకూర్ సంచలన వార్నింగ్
Mrunal Thakur: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అసభ్యకరమైన పనులు చేస్తున్న వాళ్లకు స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. డీప్ ఫేక్ కంటెంట్ వెంటనే ఆపేయాలని, లేదంటే లీగల్ యాక్షన్ తప్పదని ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Mrunal Thakur: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత హక్కులకు, ఇమేజ్‌కి పెద్ద ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మృణాల్ ఠాకూర్ సీరియస్ అయింది. డీప్ ఫేక్ కంటెంట్ చేస్తున్న వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

మృణాల్ ఠాకూర్ వార్నింగ్
తన రూపంతో డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్న వాళ్లకు మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
"నా పోలికలు, రూపాన్ని ఉపయోగిస్తూ డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత చట్టవిరుద్ధం. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
దీన్ని నా నుంచి చివరి హెచ్చరిక లేదా ‘ఫార్మల్ లీగల్ నోటీసు’గా పరిగణించి వెంటనే ఆపేయండి. నా గుర్తింపును మళ్లీ దుర్వినియోగం చేస్తే తీవ్ర చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
రష్మిక మందన్న వీడియో
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏఐని మిస్ యూజ్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడంపై స్టార్లు పోరాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) కి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ సంఘటన తనను ఎంతగానో భయాందోళనకు గురిచేసిందని రష్మిక బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది.
కోర్టుకెక్కిన బాలీవుడ్ స్టార్స్
తమ ‘పర్సనాలిటీ అండ్ వాయిస్ రైట్స్’ కాపాడుకునేందుకు అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కార్తిక్ ఆర్యన్, సునీల్ శెట్టి వంటి అగ్ర తారలందరూ న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరమైన రక్షణ పొందారు.
రాకాలో మృణాల్ ఠాకూర్!
మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా నటించిన 'డెకాయిట్' (Dacoit) మూవీ తెలుగులో హిట్ గా నిలిచింది. హిందలో మాత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ (Atlee) – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమాలో మృణాల్ నటిస్తోంది. ఇది రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ సైన్స్-ఫిక్షన్ యాక్షన్ డ్రామా.
రాకా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2027 నాటికి భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


