అవును పెళ్లి చేసుకుంటున్నాను.. సరైనోడి కోసం వెయిటింగ్: మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళ స్టార్ ధనుష్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలను ఖండించిన ఆమె.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? అనే విషయాలపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన మృణాల్ ఠాకూర్.. తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ఇటీవల ఆమె తమిళ స్టార్ హీరో ధనుష్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 14న వీరి పెళ్లి అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పెడుతూ, అసలు తన పెళ్లి ప్లాన్స్ ఏంటో బయటపెట్టింది.

పెళ్లి చేసుకుంటా.. కానీ ఒక కండీషన్!
తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం గురించి అడగగా.. మృణాల్ ఠాకూర్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "అవును, కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అది నా ప్లాన్‌లో ఉంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. సరైన సమయం రావాలి, సరైన వ్యక్తి నా జీవితంలోకి రావాలి. అలా జరిగినప్పుడు.. సోషల్ మీడియా ద్వారా అందరికంటే ముందు నేనే ఆ విషయాన్ని ప్రకటిస్తాను" అని ఆమె స్పష్టం చేసింది. తనకు నచ్చిన వాడు దొరికితేనే పెళ్లి అని చెప్పకనే చెప్పింది.
ఈ తరం పెళ్లిళ్లు వేరు..
ఇప్పటి తరంలో పెళ్లి నిర్ణయాలు ఎలా మారుతున్నాయో కూడా మృణాల్ వివరించింది. "ఒకప్పుడు జనాలు రకరకాల కారణాల వల్ల, సామాజిక ఒత్తిళ్ళ వల్ల పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ తరం వాళ్లు నిజమైన బంధానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్లకు నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు" అని ఆమె అభిప్రాయపడింది.
ధనుష్‌తో పెళ్లి వార్తలపై..
ఇటీవల మృణాల్, ధనుష్ ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె 'గలటా ప్లస్' ఇంటర్వ్యూలో గట్టిగానే సమాధానం ఇచ్చింది.
"నేనా? లేదు. నాకు తెలిసి ఫిబ్రవరి 14 అనేది ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే) లాంటిది. ఎవరో ఈ రూమర్స్ మొదలుపెట్టారు. నేను అనని మాటలను కూడా నేనే అన్నట్లు రాసేస్తున్నారు. ఇది చాలా భయంగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మృణాల్, ధనుష్ రూమర్స్ ఇలా
మృణాల్, ధనుష్ డేటింగ్ చేస్తున్నారని అధికారికంగా ఎప్పుడూ నిర్ధారణ కాలేదు. కానీ గతేడాది ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే' (Tere Ishk Mein) ర్యాప్ పార్టీకి మృణాల్ వెళ్లడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్‌ను మృణాల్ ఆప్యాయంగా హగ్ చేసుకోవడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇప్పుడు మృణాల్ ఇచ్చిన క్లారిటీతో వీటన్నింటికీ పుల్ స్టాప్ పడింది.
మృణాల్ కెరీర్ ఇలా..
మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ డ్రామా 'దో దివానే షెహర్ మే' (Do Deewane Seher Mein) విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రవి ఉద్యవర్ దర్శకత్వం వహించాడు. సంజయ్ లీలా భన్సాలీ, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. శశాంక్, రోష్ని అనే ఇద్దరు ప్రేమికుల అసంపూర్ణ ప్రేమకథగా ఇది తెరకెక్కింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


