వాలెంటైన్స్ డేనాడు ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇలా.. ఆరోజు నాకొక ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ..

మృణాల్ ఠాకూర్, ధనుష్ ఈ వాలెంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా మృణాల్ స్పందించింది. ఆ రోజు తనకు ఓ ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ ఆమె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.

Published on: Feb 12, 2026, 18:05:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, తమిళ స్టార్ ధనుష్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె ఫన్నీగా స్పందించింది. ఈ రూమర్స్, సిద్ధాంత్ చతుర్వేది టీజింగ్ విశేషాలు ఇక్కడ చూడండి.

వాలెంటైన్స్ డేనాడు ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇలా.. ఆరోజు నాకొక ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ..
వాలెంటైన్స్ డేనాడు ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్ ఇలా.. ఆరోజు నాకొక ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ..

"అది పెళ్లి రోజు కాదు.. ఏప్రిల్ ఫూల్స్ డే"

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా ఒక వార్త హల్చల్ చేస్తోంది. నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రేమలో ఉన్నారని, ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తన తాజా హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పుకార్లపై మృణాల్ స్పందించింది.

తాజాగా 'గలాటా ప్లస్' ఇంటర్వ్యూలో హోస్ట్ పెళ్లి గురించి పరోక్షంగా ప్రశ్నించగా.. మృణాల్ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. "నేనా? లేదు. నాకు తెలిసి ఫిబ్రవరి 14 అనేది ఏప్రిల్ 1 (ఏప్రిల్ ఫూల్స్ డే) లాంటిది. ఎవరో ఈ రూమర్స్ మొదలుపెట్టారు. నేను ఏమీ చెప్పకపోయినా, నేనే చెప్పినట్లు రాసేస్తున్నారు. వావ్.. ఎంత అందంగా రాస్తున్నారో.. కానీ ఇది చాలా భయంగా ఉంది" అంటూ మృణాల్ ఆ వార్తలను కొట్టిపారేసింది. పక్కనే ఉన్న కో-స్టార్ సిద్ధాంత్ చతుర్వేది నవ్వు ఆపుకోలేకపోయాడు.

సిద్ధాంత్ టీజింగ్.. చెన్నై లింక్

అంతకుముందు ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో రిపోర్టర్ "చెన్నైకి సంబంధించిన ప్రశ్నలు" అడగగా.. సిద్ధాంత్ వెంటనే మృణాల్ వైపు చూపిస్తూ "చెన్నై ప్రశ్న ఈమెకా? నాకా?" (ధనుష్ చెన్నై కావడంతో) అంటూ టీజ్ చేశాడు. అప్పుడు మృణాల్ గట్టిగా నవ్వి, ఆ ప్రశ్న నీకే అంటూ కవర్ చేసుకుంది. "మాకు అర్థమవుతోందిలే.." అంటూ రిపోర్టర్లు కూడా కామెంట్ చేశారు.

అసలు ఈ రూమర్స్ ఎలా వచ్చాయి?

2025లో ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే' ర్యాప్ పార్టీకి మృణాల్ వెళ్లడంతో ఈ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఆగస్టులో 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌కు వచ్చిన ధనుష్‌ను మృణాల్ ఆప్యాయంగా ఆహ్వానించడం, హగ్ చేసుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇక ఫిబ్రవరి 14న పెళ్లి అని టాక్ వచ్చినా, అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మృణాల్ క్లారిటీతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

సినిమాల విషయానికొస్తే..

మృణాల్ నటించిన 'దో దివానే షెహర్ మే' ఫిబ్రవరి 20న విడుదల కానుంది. తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశం ఉందని టాక్. ధనుష్ ప్రస్తుతం ‘కారా’, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More