ధనుష్‌తో డేటింగ్ పుకార్లు- స్టేజీపై చెన్నై కనెక్షన్ అంటూ యంగ్ హీరో- సిగ్గు పడిన మృణాల్ ఠాకూర్- ముసిముసిగా నవ్వుతూ!
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలపై తాజాగా హీరో సిద్ధాంత్ చతుర్వేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మృణాల్‌ను 'చెన్నై కనెక్షన్' పేరుతో ఆటపట్టించగా హీరోయిన్ సిగ్గుతో ముసి ముసి నవ్వులు చిందించిన వీడియో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన నటనతో, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ వేడుకలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి కనిపించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.

బాలీవుడ్ యంగ్ హీరో
తాజాగా ఈ రూమర్లపై మృణాల్ సహ నటుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది చేసిన సరదా కామెంట్స్ ఆ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. అంతేకాకుండా ఆ వ్యాఖ్యలకు మృణాల్ ఠాకూర్ ముసిముసిగా నవ్వడం మరింత హాట్‌గా మారింది.
సిద్ధాంత్ ఏమన్నాడంటే?
మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన సరికొత్త చిత్రం 'దో దీవానే సెహర్ మే' (Do Deewane Seher Mein). ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
చెన్నై వాళ్లు అడుగుతున్నారు
ఈ సందర్భంగా ఒక విలేకరి "మీ వాళ్లు చెన్నై కనెక్షన్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు" అని అనగానే, సిద్ధాంత్ చురుగ్గా స్పందిస్తూ.. "ఆ ప్రశ్న ఆమె (మృణాల్ ఠాకూర్) గురించా? లేక నా గురించా?" అంటూ మృణాల్ వైపు సైగ చేస్తూ ఆటపట్టించారు. దాంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు.
అది నీకోసమే
దానికి మృణాల్ ఠాకూర్ వెంటనే "అది నీ కోసమే" అని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, సిద్ధాంత్ మాత్రం వదలకుండా.. "ఆమె వేరే ఎవరికో వధువు కాబోతోంది" అంటూ చమత్కరించారు. సిద్ధాంత్ చేసిన ఈ 'చెన్నై కనెక్షన్' కామెంట్లకు మృణాల్ ఆపలేక సిగ్గుపడుతూ కనిపించారు.
వాలెంటైన్స్ డే పెళ్లి వార్తలు నిజమేనా?
అలా కంటిన్యూగా మృణాల్ ఠాకూర్ ముసిముసిగా నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. దాంతో అక్కడున్న రిపోర్టర్స్ అంతా "మాకు అర్థం అయింది" అంటూ నవ్వులు కురిపించారు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డేకి) ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎలాంటి నిజం లేదు
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. "మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవడం లేదు. ఫిబ్రవరిలో ఆమె సినిమా విడుదల ఉంది. మార్చిలో తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కేవలం వదంతులే" అని వారు కొట్టిపారేశారు.
'దో దీవానే సెహర్ మే' విశేషాలు
సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రవి ఉద్యావర్ దర్శకత్వం వహించిన దో దీవానే సెహర్ మే ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కింది. మృణాల్, సిద్ధాంత్ జోడీ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


