OTT Thriller: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. 15 మంది ఫ్రెండ్స్.. ఓ పార్టీ.. ఓ మర్డర్.. చేసింది ఎవరు?

OTT Thriller: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) నుంచి మరో ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. 'ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా' పేరుతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రీమియర్ కానుంది. రజత్ కపూర్, వినయ్ పాఠక్ వంటి దిగ్గజ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Published on: Apr 6, 2026, 21:52:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5), అప్లాజ్ సోషల్, మిథ్యా టాకీస్‌తో కలిసి తీసిన మూవీ 'ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా' (Everybody Loves Sohrab Handa). ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

OTT Thriller: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. 15 మంది ఫ్రెండ్స్.. ఓ పార్టీ.. ఓ మర్డర్.. చేసింది ఎవరు?
OTT Thriller: ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. 15 మంది ఫ్రెండ్స్.. ఓ పార్టీ.. ఓ మర్డర్.. చేసింది ఎవరు?

ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా స్టోరీ

సినిమా టైటిల్ ను బట్టి స్టోరీ లైన్ అంచనా వేయడం కష్టమే. నిజానికి టైటిల్ చూస్తే అందరూ అతడిని ప్రేమిస్తున్నారని అనిపిస్తుంది కానీ, కథలో అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. 15 మంది ప్రాణ స్నేహితులు కలిసి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తారు.

రాత్రంతా సరదాగా గడిచిన ఆ పార్టీలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. సోహ్రాబ్ హండా అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురవుతాడు. అందరూ అతడిని ఇష్టపడేవారే.. కానీ అతడిని చంపాలనుకున్నది ఎవరు? ఆ 15 మంది స్నేహితుల్లో దోషి ఎవరు? అనేది ఈ మూవీ స్టోరీ.

భారీ తారాగణం.. అద్భుతమైన టీమ్

ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటులైన రజత్ కపూర్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా వంటి వాళ్లు నటించారు. వీరితో పాటు నీల్ భూపాలం, చంద్రచూడ్ రాయ్, వలూషా డి సౌజా వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సమీర్ నాయర్ నేతృత్వంలోని అప్లాజ్ సోషల్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత నాణ్యతతో నిర్మించింది.

ఏప్రిల్ 10న వేట మొదలు

సోహ్రాబ్ హండా హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పాత్రకు ఒక గతం, ప్రతి స్నేహానికి ఒక స్వార్థం ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ క్రేజీ మర్డర్ మిస్టరీ ఏప్రిల్ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు.

నిజానికి ఈ ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా అనే మూవీ థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయతే నవంబర్, 2023లో మాత్రం మామీ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఇప్పుడు సుమారు రెండున్నరేళ్ల తర్వాత నేరుగా జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More