...
...
Next Story

Musafir Cafe: వావ్.. తన వెబ్ సిరీస్ స్టోరీనే రియల్ లైఫ్‌లో ఫాలో అవుతున్న హీరో.. ప్రకృతి ఒడిలో 'ముసాఫిర్ కేఫే'

Musafir Cafe: వెబ్ సిరీస్ స్టోరీయే నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది. అందులోనూ అందులో నటించిన హీరోనే ఆ కథను నిజం చేయాలని భావిస్తే.. అచ్చూ విక్రాంత్ మాస్సేలాగే ఉంటుందేమో. తాను నటించిన ముసాఫిర్ కేఫేలను అతడు రియల్ లైఫ్ లోకి తీసుకొస్తున్నాడు.

Published on: Sep 30, 2026, 18:51:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Musafir Cafe: '12thఫెయిల్' సినిమాతో నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మాస్సే (Vikrant Massey) ఒక సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. తన హిట్ వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫే' (Musafir Cafe) నుంచి ఇన్‌స్పైర్ అయి, తన భార్య శీతల్ ఠాకూర్‌తో కలిసి రియల్ లైఫ్‌లో కేఫేలను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ధర్మశాల, ఉత్తరాఖండ్ కొండల్లో ‘ముసాఫిర్ కేఫే’

Musafir Cafe: వావ్.. తన వెబ్ సిరీస్ స్టోరీనే రియల్ లైఫ్‌లో ఫాలో అవుతున్న హీరో.. ప్రకృతి ఒడిలో 'ముసాఫిర్ కేఫే' (Instagram/@vikrantmassey)
Musafir Cafe: వావ్.. తన వెబ్ సిరీస్ స్టోరీనే రియల్ లైఫ్‌లో ఫాలో అవుతున్న హీరో.. ప్రకృతి ఒడిలో 'ముసాఫిర్ కేఫే' (Instagram/@vikrantmassey)

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ముసాఫిర్ కేఫే వెబ్ సిరీస్ మీరు చూశారా? అందులో చూపించినది ఇప్పుడు రియల్ లైఫ్ లోకీ రాబోతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల, అలాగే ఉత్తరాఖండ్ ప్రశాంతమైన హిల్ స్టేషన్లలో విక్రాంత్ మాస్సే ఈ కేఫేలను ప్లాన్ చేస్తున్నారు.

మిడ్-డే రిపోర్ట్ ప్రకారం.. 'ముసాఫిర్ కేఫే' వెబ్ సిరీస్‌లో విక్రాంత్.. 'చందర్' పాత్రలో కనిపించిన కేఫే థీమ్‌తోనే ఈ రెండింటిని డిజైన్ చేస్తున్నారు. సిటీల హడావుడి, కాంక్రీట్ జంగిల్ రద్దీ నుంచి బయటపడి ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం ఇది ఒక పర్ఫెక్ట్ వెకేషన్ స్పాట్‌లా మారనుంది.

కేవలం కాఫీ మాత్రమే కాదు.. ఆర్టిస్ట్స్ కోసం 20 స్పెషల్ రూమ్స్

ఈ 'ముసాఫిర్ కేఫేలు' కేవలం నార్మల్ కాఫీ, రుచికరమైన ఫుడ్ మాత్రమే కాకుండా ఒక క్రియేటివ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ విజిటర్స్ కోసం ప్రత్యేకంగా బుక్స్, రీడింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు.

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ ఆర్టిస్టుల కోసం దాదాపు 20 స్పెషల్ రూమ్‌లను 'ఆర్టిస్ట్ రెసిడెన్సీలు'గా ప్లాన్ చేస్తున్నారు. రైటర్స్, పెయింటర్స్, మ్యూజిషియన్స్ లాంటి క్రియేటివ్ పీపుల్ ఇక్కడే ఉంటూ తమ ప్రాజెక్ట్‌లపై వర్క్ చేసుకోవచ్చు. ప్రకృతి ప్రశాంతత మధ్య తమ డ్రీమ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

ఫ్యాన్స్ ఐడియానే బిజినెస్ ప్లాన్.. వచ్చే వేసవికి ఓపెనింగ్

షో క్రియేటర్ శరణ్య రాజ్‌గోపాల్, విజయ్ సుబ్రమణ్యం, దివ్య ప్రకాష్‌లతో చర్చించిన తర్వాత విక్రాంత్.. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ కేఫేలను గ్రాండ్‌గా ప్రారంభించాలని విక్రాంత్ ప్లాన్ చేస్తున్నారు.

'12th ఫెయిల్' నుంచి 'చౌహాన్' వరకు.. విక్రాంత్ మాస్సే బిజీ షెడ్యూల్

టెలివిజన్ నుంచి సినిమాల్లోకి వచ్చి '12th ఫెయిల్', 'సెక్టార్ 36', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా' లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విక్రాంత్. రీసెంట్‌గా 'ప్రీతమ్ అండ్ పెడ్రో'లో కనిపించిన ఆయన.. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిపోయారు.

విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రీలతో కలిసి 'ఓ రోమియో' సినిమాలో నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్ కాంబినేషన్లో రాబోతున్న 'చౌహాన్' ప్రాజెక్ట్‌లోనూ విక్రాంత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్ 'ముసాఫిర్ కేఫే' సీజన్ 2లో కూడా చందర్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks