ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సోషల్ మీడియాలో జరిగిన ఒక స్కామ్‌కు బలయ్యాడు. తన తల్లి చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు లేవని ఒక నెటిజన్ చెప్పిన కట్టుకథను నిజమని నమ్మి, మానవత్వంతో రూ. 20,000 పంపించాడు. తీరా అది స్కామ్ అని నెటిజన్లు బయటపెట్టడంతో.. జీవీ మోసపోయారని తెలిసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు.
సాయం చేయబోయి మోసపోయాడు

మంచి మనసుతో సాయం చేయబోయి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఆన్ లైన్ మోసానికి గురయ్యాడు. డిసెంబర్ 25న ఎక్స్ వేదికగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎక్స్ లో 'ప్రసన్న సదీష్' (Mom Little King) అనే ఒక యూజర్ ఒక మహిళ ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ స్టోరీ రాశాడు. "మా అమ్మ మమ్మల్ని, నా చెల్లిని కష్టపడి పెంచింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, సాయం చేయండి" అంటూ జీవీ ప్రకాష్‌ను ట్యాగ్ చేశాడు.
మొదట ఉదయం 11 గంటలకు పెట్టిన ట్వీట్‌ను జీవీ చూడలేదు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ట్యాగ్ చేయడంతో.. జీవీ వెంటనే స్పందించాడు. "నీ GPay నంబర్ చెప్పు" అని అడిగి, వెంటనే రూ. 20,000 ట్రాన్స్ఫర్ చేసి, ఆ స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు.
అది పాత ఫొటో అని తెలిసి..
జీవీ డబ్బులు పంపాక, నెటిజన్లు అసలు విషయం కనిపెట్టేశారు. ఆ పోస్టులో ఉన్న మహిళ నిజానికి 2022లోనే చనిపోయిందట. పాత ఫోటోను వాడుకుని, ఆ వ్యక్తి ఇలా సెలబ్రిటీల దగ్గర డబ్బులు దండుకుంటున్నాడని తేలింది.
జీవీ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందించారు. "సార్ మీరు పబ్లిక్‌గా మోసపోయారు. ఆ ఫోటో పాతది" అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. మరొకరు స్పందిస్తూ.. "నేను కూడా అతన్ని నమ్మి రూ. 1000 పంపాను" అని వాపోయారు.
{{/usCountry}}జీవీ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందించారు. "సార్ మీరు పబ్లిక్‌గా మోసపోయారు. ఆ ఫోటో పాతది" అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. మరొకరు స్పందిస్తూ.. "నేను కూడా అతన్ని నమ్మి రూ. 1000 పంపాను" అని వాపోయారు.
{{/usCountry}}దయచేసి సాయం చేసే ముందు ఒకసారి నిజమా కాదా అని చెక్ చేసుకోండి అని ఫ్యాన్స్ జీవీకి సూచిస్తున్నారు. సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని కోరుతున్నారు. అయితే దీనిపై జీవీ ప్రకాష్ ఇంకా స్పందించలేదు.