మోసపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. మా అమ్మ చనిపోయింది.. అంత్యక్రియలకు డబ్బు కావాలంటూ బురిడీ కొట్టించిన అభిమాని
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఓ స్కామ్ బారిన పడ్డాడు. తన తల్లి చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు కావాలని ఓ అభిమాని అడిగితే రూ.20 వేలు పంపించాడతడు. ఆ తర్వాత అది స్కామ్ అని తెలుసుకున్నాడు.
ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సోషల్ మీడియాలో జరిగిన ఒక స్కామ్‌కు బలయ్యాడు. తన తల్లి చనిపోయిందని, అంత్యక్రియలకు డబ్బులు లేవని ఒక నెటిజన్ చెప్పిన కట్టుకథను నిజమని నమ్మి, మానవత్వంతో రూ. 20,000 పంపించాడు. తీరా అది స్కామ్ అని నెటిజన్లు బయటపెట్టడంతో.. జీవీ మోసపోయారని తెలిసి ఫ్యాన్స్ అయ్యో పాపం అంటున్నారు.

సాయం చేయబోయి మోసపోయాడు
మంచి మనసుతో సాయం చేయబోయి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఆన్ లైన్ మోసానికి గురయ్యాడు. డిసెంబర్ 25న ఎక్స్ వేదికగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎక్స్ లో 'ప్రసన్న సదీష్' (Mom Little King) అనే ఒక యూజర్ ఒక మహిళ ఫోటోను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ స్టోరీ రాశాడు. "మా అమ్మ మమ్మల్ని, నా చెల్లిని కష్టపడి పెంచింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె అంత్యక్రియలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, సాయం చేయండి" అంటూ జీవీ ప్రకాష్‌ను ట్యాగ్ చేశాడు.
మొదట ఉదయం 11 గంటలకు పెట్టిన ట్వీట్‌ను జీవీ చూడలేదు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ట్యాగ్ చేయడంతో.. జీవీ వెంటనే స్పందించాడు. "నీ GPay నంబర్ చెప్పు" అని అడిగి, వెంటనే రూ. 20,000 ట్రాన్స్ఫర్ చేసి, ఆ స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశాడు.
అది పాత ఫొటో అని తెలిసి..
జీవీ డబ్బులు పంపాక, నెటిజన్లు అసలు విషయం కనిపెట్టేశారు. ఆ పోస్టులో ఉన్న మహిళ నిజానికి 2022లోనే చనిపోయిందట. పాత ఫోటోను వాడుకుని, ఆ వ్యక్తి ఇలా సెలబ్రిటీల దగ్గర డబ్బులు దండుకుంటున్నాడని తేలింది.
జీవీ చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందించారు. "సార్ మీరు పబ్లిక్‌గా మోసపోయారు. ఆ ఫోటో పాతది" అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. మరొకరు స్పందిస్తూ.. "నేను కూడా అతన్ని నమ్మి రూ. 1000 పంపాను" అని వాపోయారు.
దయచేసి సాయం చేసే ముందు ఒకసారి నిజమా కాదా అని చెక్ చేసుకోండి అని ఫ్యాన్స్ జీవీకి సూచిస్తున్నారు. సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని కోరుతున్నారు. అయితే దీనిపై జీవీ ప్రకాష్ ఇంకా స్పందించలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


